Begin typing your search above and press return to search.
ఏవో ఏవో కలలే..'మజిలీ' టోన్ గుర్తుకొస్తోందిగా!
By: Tupaki Desk | 26 March 2021 7:30 AM GMTనాగచైతన్య- సాయిపల్లవి జంటగా శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా `లవ్‌స్టోరీ`. ఈ సినిమా నుంచి వరుస సింగిల్స్ అక్కినేని అభిమానుల్లో వైరల్ అవుతున్నాయి. ఇంతకుముందు సారంగ దరియా సాంగ్ వెబ్ -యూట్యూబ్ లో సునామీని సృష్టించింది.
తాజాగా రిలీజైన ఏవో ఏవో కలలే ... సాంగ్ అంతే సెన్సేషన్స్ సృష్టిస్తోంది. తాజా లిరికల్ వీడియో సాంగ్ ను సూపర్ స్టార్ మహేశ్‌బాబు విడుదల చేశారు. భాస్కర్ భట్ల రచించిన ఈ గీతాన్ని జోనితా గాంథీ- నకుల్ అభ్యంకర్ ఆలపించారు.
ఇక ఎంతో ఇంటెన్సివ్ టోన్ తో ఉన్న ఈ పాటకు పవన్ సీహెచ్ సంగీతం ప్రధాన ఆకర్షణగా మారింది. ఈ పాట చిత్రీకరణకోసం సింపుల్ గా వర్షం నేపథ్యాన్ని ఎంచుకున్న తీరు కానీ.. పాటలో చైతన్య- సాయిపల్లవి జోడీని ఎలివేట్ చేస్తున్న తీరు కానీ ఆసక్తిని కలిగించాయి. శేఖర్ వీజే స్టైలిష్ కొరియోగ్రఫీ ఈ పాటకు ప్రధాన బలం కానుంది.
నిజానికి పాటల్ని తెరకెక్కించేందుకు ఫారిన్ బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్లు అవసరం లేదని కమ్ముల శైలి మేకింగ్ స్టైల్ చెబుతుంది. ఎలాంటి అనవసర హంగామా లేకుండా కథలో భాగంగానే ఈ పాటను చిత్రీకరించారని అర్థమవుతోంది. ఒక అందమైన కథానేపథ్యాన్ని పాటలో చూపించాలన్న తపన మాత్రమే కనిపిస్తోంది. ఇక తాజా పాటలో కేవలం ట్యూన్ మాత్రమే వినిపిస్తోంది. వీడియోలో చైతూ లుక్ పరంగా బ్లాక్ బస్టర్ `మజిలీ` టోన్ తో కనిపిస్తుండడం ఆసక్తికరం. ఈ సినిమాలో అతడు నైజాం యాసతో అలరించనున్నారు. పూర్తిగా వీడియో రిలీజైతే అది చై- సాయిపల్లవి అభిమానులకు స్పెషల్ ట్రీట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. లవ్‌స్టోరీ థియేటర్లలో ఏప్రిల్ 16న విడుదలవుతోంది.