Begin typing your search above and press return to search.
ఈవీవీ గారు ఎప్పుడూ ఆ మాట అంటుండేవారు: దర్శకుడు దేవీప్రసాద్
By: Tupaki Desk | 2 Aug 2021 7:33 AM GMTదేవీప్రసాద్ మెగాఫోన్ పట్టేసి చాలాకాలమే అయింది. హాస్యభరితమైన కథలను ఎక్కువగా ఆయన తెరకెక్కించారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన కెరియర్ గురించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "శ్రీకాంత్ హీరోగా 'ఆడుతూ పాడుతూ' సినిమా ద్వారా నేను దర్శకుడిగా పరిచయమయ్యాను. అప్పటి నుంచి కామెడీపాళ్లు ఎక్కువగా ఉన్న కథలనే చేస్తూ వచ్చాను. ఈవీవీ గారి పెద్దబ్బాయి ఆర్యన్ రాజేశ్ హీరోగా 'లీలామహల్ సెంటర్' చేశాను. తొలి రోజునే ఆ సినిమాకి మంచి టాక్ వచ్చింది .. హిట్ అయింది.
'లీలామహల్ సెంటర్' సినిమా చూసి ఈవీవీగారు చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఆయన ఆ సినిమా చూడాగానే నాకు కాల్ చేశారు. 'చాలా బాగా తీశావు' అంటూ నన్ను అభినందించారు. "లేదు సార్ అన్నీ అలా కుదిరాయంతే .. అంతకుమించి ఏమీ లేదు" అన్నాను నేను. అయినా మనస్ఫూర్తిగా ఆయన నన్ను ప్రశంసించారు. అంతేకాకుండా ఆ రోజు సాయంత్రమే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి, మీడియా ముఖంగా నాకు థ్యాంక్స్ చెప్పారు. అంత పెద్ద దర్శకుడు .. అప్ కమింగ్ డైరెక్టర్ ని అయిన నన్ను అంతగా అభినందించవలసిన అవసరం లేదు. అది ఆయన గొప్పతనం .. అంతే.
ఈవీవీ గారి ప్రశంసలను నేను ఆశీస్సులుగా భావించాను. ఆర్యన్ రాజేశ్ తోనే కాదు .. 'అల్లరి' నరేశ్ తోను 'బ్లేడ్ బాబ్జి' .. 'కెవ్వుకేక' సినిమాలు చేశాను. ఆ సినిమాలు కూడా సక్సెస్ ను సాధించాయి. అప్పుడు ఈవీవీగారు తరచూ నాతో ఓ మాట అంటుండేవారు. "రాజేశ్ .. నరేశ్ ఇద్దరూ కూడా నీ హీరోలు. నువ్వు ఎప్పుడు అడిగినా వాళ్లు కాదనకుండా సినిమా చేస్తారు" అంటుండేవారు. ఆయన చనిపోవడానికి ఓ 20 రోజుల ముందు కలిసినప్పుడు కూడా ఆయన నాతో ఇదే మాట అన్నారు. నాపై ఆయనకి గల నమ్మకం అది.
'అల్లరి' నరేశ్ తో 'బ్లేడ్ బాబ్జి' సినిమా చేయాలనుకున్నప్పుడు ఈవీవీ గారు కథ కూడా వినలేదు. 'నువ్వేంటో నాకు తెలుసు .. నాకు కథ చెప్పనవసరం లేదు .. నువ్వు బాగా తీస్తావ్ అనే నమ్మకం నాకు ఉంది" అన్నారు. అంత నమ్మకంతో ఆయన నన్ను ప్రోత్సహించేవారు. ఆయన మాటలు నాకూ ఎంతో ఆనందాన్ని కలిగించేవి. ఈవీవీ గారికి కామెడీ అంటే ఎంతో ఇష్టం. ఆయన కామెడీని అద్భుతంగా తీస్తారు. నా సినిమాల్లో కూడా మంచి కామెడీ ఉండటంతో, ఆయన నన్ను బాగా ఎంకరేజ్ చేసేవారు.
నా సినిమాలు చూసినవాళ్లంతా నేను ఈవీవీ గారి దగ్గర పనిచేశానని అనుకుంటారు. కానీ నేను ఆయన దగ్గర పనిచేయలేదు. నేను ప్రత్యేకించి ఎప్పుడూ కామెడీ సినిమాలనే తీయాలని అనుకోలేదు. కాకపోతే కథ ఏదైనా ప్రేక్షకులు భారంగా ఫీలవకూడదనే ఉద్దేశంతో కామెడీ తప్పకుండా ఉండేలా చూసుకునేవాడిని. నా సినిమాల్లో కామెడీ ట్రాకులకు మంచి పేరు రావడంతో, కామెడీ సినిమాలు చేయమని ఆఫర్లు వచ్చాయి. దాంతో పూర్తిస్థాయి కామెడి సినిమాలు చేస్తూ వెళ్లాను. ఇకపై మాత్రం అన్నిరకాల కథలను చేయాలనే అనుకుంటున్నాను" అని చెప్పుకొచ్చారు.