Begin typing your search above and press return to search.

మాజీ హీరోయిన్ ఫ్యామిలీ నిండా మునిగింది

By:  Tupaki Desk   |   21 March 2017 11:35 AM GMT
మాజీ హీరోయిన్ ఫ్యామిలీ నిండా మునిగింది
X

టైం బాగున్నపుడు అన్ని పరిస్థితులు మంచిగానే కనిపిస్తాయి. కానీ ఏదైనా వచ్చినపుడే అన్ని వ్యతిరేకంగా మారిపోతుంటాయి. ప్రస్తుతం ఓ సెలబ్రిటీ జంట పరిస్థితి ఇలాగే ఉంది. ఆమె ఓ ఫేమస్ హీరోయిన్. టాలీవుడ్ లో దాదాపు అందరు హీరోలతోను నటించిన హిస్టరీ ఉంది.

ఇద్దరు బడా స్టార్లతో కెరీర్ ప్రారంభంలోనే ఇండస్ట్రీ హిట్లు కొట్టేసింది. కందిరీగ కుట్టినట్లుగా ఉండే పెదవులు ఈమెకు ప్రధాన ఆకర్షణ. అంత పెద్ద హీరోయిన్ అయి ఉండి కూడా.. టాలీవుడ్ తో సన్నిహిత సంబంధాలు ఉన్న ఓ ఫిట్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహిచే వ్యక్తిని పెళ్లాడి.. అందరినీ ఆశ్చర్యంలో ముంచేసింది. హీరోయిన్ గా ఈమె.. ఫిట్నెస్ ట్రైనర్ గా ఆమె భర్త ఉన్నంత కాలం అంతా బాగానే ఉంది. తర్వాత ఈమె నిర్మాతగా అవతరించాకే.. తోడుగా ఉన్నవాళ్లంతా ఒక్కొక్కళ్లుగా దూరమైపోయారు. రీసెంట్ గా దుబాయ్ లో ఫిట్నెస్ క్లాసులు కూడా ఇచ్చారు కానీ.. అది కూడా వర్కవుట్ కాలేదు.

ఆమె మళ్లీ సినిమాల్లో ప్రయత్నించినా అదీ సత్ఫలితాలు ఇవ్వలేదు. దీంతో వేరే వ్యాపారలతో బాగానే ప్రయత్నించగా.. ఇప్పటివరకూ 10 కోట్ల రూపాయల నష్టాల్లో మునిగిపోయారట. ప్రస్తుతం ఈ పరిస్థితి నుంచి బయటకు వచ్చేందుకు కొత్త వెంచర్స్ ప్రారంభిస్తున్నారట. ఈ పీకల్లోతు అప్పుల్లోంచి వీరు ఎలా బయటపడారో అనుకుంటున్నారు సినీ జనాలు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/