Begin typing your search above and press return to search.
మ్యాన్ హ్యాండ్లింగ్ కేసులో ఖడ్గం బ్యూటీ
By: Tupaki Desk | 3 July 2018 11:09 AM GMTముసుగు వెయ్యొద్దు మనసు మీద అంటూ ఖడ్గం సినిమాలో కుర్రకారును ఉర్రూతలూగించిన కిమ్ శర్మ తెలుగు ప్రేక్షకులకు కూడా కొంత సుపరిచితురాలు. హిందీలో కూడా కొన్ని పెద్ద సినిమాల్లో మెరిసి ఇప్పుడు కనుమరుగయిపోయింది. ఇప్పుడు మల్లి వార్తల్లో ఆమె పేరు రావడనికి గల కారణం ఆమె చేసిన ఒక ఘనకార్యం. ఆమె ఇంట్లో పని చేసే పని అమ్మాయి కిమ్ పైన కేసు వేసింది.
బట్టలు ఉతికిన పానమ్మాయి పొరపాటున తెలుపు దుస్తులు మాములు దుస్తులతో కలిపి వేసెయ్యడంతో, నలుపు రంగు దుస్తులనుండి కొంత రంగు తెలుపు దుస్తులకు అంటుకోవడం జరిగింది. ఈ విషయాన్ని గమనించిన పనమ్మాయి వెంటనే కిమ్ వడ్డలు వెళ్లి క్షమాపణలు చెప్పగా, ఆమె మాత్రం చాల దారుణంగా రియాక్ట్ అయ్యింది. తనపై చెయ్యి చేసుకోవటమే కాక ఇంట్లోనుండి వెళ్లిపొమ్మని ఇంకెప్పుడు రావద్దని హెచ్చరించిందని బాధితురాలు వాపోయింది. అంతే కాదు తనకు రావాల్సిన నెలసరి జీతం కూడా ఇవ్వను అనటంతో దిగులు చెందిన పనమ్మాయి వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా, ఈ సంగతి బయటికి పొక్కింది.
రంగంలోకి దిగిన పోలీసులు కిమ్ పైన సెక్షన్ 323 - 504 మరియు ఐపీసీ కింద కేసు నమోదు చేసారు. ఒక పోలీస్ ఆఫీసర్ ఈ కేసును కోర్టుకు త్వరలో తీసుకెళ్ళబోతున్నామని మీడియాకు వివరించారు. కాకపోతే కిమ్ శర్మ మాటలు మాత్రం వేరేలా ఉన్నాయి. ఇవ్వవలసిన డబులు 17 వ తారీఖున ఇచ్చేస్తానని - మరియు ౭౦౦౦౦ విలువచేసే బట్టలు పాడుచేయడం వలన కోపంలో ఆమెను పనిలోంచి తీసేసాను తప్ప కొట్టలేదని చెప్తోంది.