Begin typing your search above and press return to search.

మాజీ భర్తకు సూపర్ కాంప్లిమెంట్ ఇచ్చిందే!

By:  Tupaki Desk   |   20 April 2019 5:34 AM GMT
మాజీ భర్తకు సూపర్ కాంప్లిమెంట్ ఇచ్చిందే!
X
బాలీవుడ్ హాట్ కపుల్ అనుకునే హృతిక్ - సుజానే ఖాన్ ఖాన్ జోడీ 2014 లో విడాకులు తీసుకోవడం దాదాపుగా చాలామందిమని షాక్ కు గురిచేసింది. కానీ విడాకులు తీసుకున్న తమ ఇద్దరు పిల్లలు రెహాన్.. హృదాన్ కోసం ఇద్దరూ కలిసి సమయం వెచ్చిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇద్దరూ ఐదేళ్ళుగా సింగిల్ గా ఉండడం.. అప్పుడప్పుడూ ఒకరితో ఒకరు కలిసి సమయం గడుపుతూ ఉండడంతో విడిపోయిన జంట మళ్ళీ ఒక్కటవుతోందని బాలీవుడ్ లో గత కొంతకాలంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి అ వార్తలు నిజమనేలా భర్తకు కాంప్లిమెంట్ ఇచ్చింది సుజానే.

హృతిక్ ఒక ఫిట్నెస్ ఫ్రీక్ అనే సంగతి తెలిసిందే. గంటల తరబడి జిమ్ములో గడుపుతూ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తుంటాడు. రెండు రోజుల క్రితం హృతిక్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక వర్క్ అవుట్ వీడియో పోస్ట్ చేశాడు. కొంతకాలంగా తన శరీరానికి తగిలిన గాయాల కారణంగా ZMR(జీరో మొమెంటం రిపిటీషన్స్) టెక్నిక్ ఫాలో అవుతున్నానని తెలిపాడు. దీంతో తనకు బలం పెరగడంతో పాటుగా గాయాల నుండి రిలీఫ్ కూడా రిలీఫ్ లభించిందని తెలిపాడు. ఇక వీడియోలో యాజ్ యూజువల్ గా హృతిక్ గ్రీక్ గాడ్ లాగా ఉన్నాడు.

దీనికి స్పందనగా "నువ్వు 20 ఏళ్ళ క్రితం కంటే ఇప్పుడు చాలా హాట్ గా ఉన్నావు" అంటూ ఈ వీడియో కు ఒక కామెంట్ పెట్టింది సుజానే. దీంతో కొంతమంది నెటిజనులు హృతిక్ - సుజానే త్వరలో ఒకటవుతున్నారని అందుకే ఇలా మాజీ భర్తపై కామెంట్లు పెడుతోందని అంటున్నారు. నిజమే.. మాజీ భర్త ఎకౌంట్ లో పోస్ట్ ను చూసి 'నువ్వు అప్పటికంటే హాట్' అని కాంప్లిమెంట్ ఇస్తే అర్థం ఏంటి? అయినా ఇద్దరు సింగిలే కదా.. చక్కగా మింగిల్ అయ్యేందుకు అడ్డంకులు లేవు. పైగా ఇద్దరికీ పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి త్వరలో రెండోసారి గ్రాండ్ వెడ్డింగ్ వార్తలు వస్తాయేమో..!