Begin typing your search above and press return to search.
డ్రగ్స్ కేసులో ముగ్గురు హీరోలకు నోటీసులు!
By: Tupaki Desk | 12 July 2017 11:02 AM GMTహైదరాబాద్ లో సంచలనం సృష్టిస్తోన్న డ్రగ్స్ రాకెట్ లో కొంతమంది సినీ ప్రముఖులకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ బుధవారం నోటీసులు జారీచేసింది. ఈ వ్యవహారంలో మొత్తం 10 మందికి ఎక్సైజ్ శాఖ నోటీసులు జారీచేసింది. 6 రోజుల్లోగా వారు విచారణకు హాజరు కావాలని సూచించింది. ఆ జాబితాలో ముగ్గురు యువ హీరోలతో పాటు నలుగురు దర్శకులు - ఇద్దరు నిర్మాతలు - స్టంట్ మాస్టర్ ఉన్నట్టు తెలుస్తోంది.
డ్రగ్స్ రాకెట్ లో పట్టుబడ్డ కెల్విన్ - బెన్ - నిఖిల్ షెట్టీలు ఇండస్ట్రీలోని ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వారిచ్చిన సమాచారంతో పలువురు వ్యక్తులకు నోటీసులు జారీ చేశారు. ఆ ముగ్గురు హీరోలు అందుబాటులో లేకపోవడంతో వారికి సంబంధించిన వారి ద్వారా నోటీసులు ఇచ్చారని తెలుస్తోంది.
ఈ డ్రగ్స్ రాకెట్ కు సంబంధించి మరో 20 మందికి నోటీసులు ఇవ్వబోతున్నారని సమాచారం. వారందరూ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారని తెలుస్తోంది. కెల్విన్ - బెన్ - నిఖిల్ షెట్టిలు ఎల్ ఎస్ డి - కొకైన్ వంటి డ్రగ్స్ ను ఇండస్ట్రీలోని వ్యక్తులకు అందించినట్లు సమాచారం. అయితే, నోటీసులు అందుకున్న ఆ ప్రముఖులను అదుపులోకి తీసుకంటారా? లేక కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేస్తారా అనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
కాగా, డ్రగ్స్ మాఫియాతో టాలీవుడ్ కు లింకులున్నాయనే ఆరోపణలపై ‘మా’ స్పందించింది. కొందరు డ్రగ్స్ తీసుకోవడం వల్ల మొత్తం సినీ పరిశ్రమకే చెడ్డ పేరు వస్తోందని పలువురు పెద్దలు అంటున్నారు. అలాంటి వాళ్లకు పరిశ్రమ సహకరించదన్నారు. తమకు సామాజిక బాధ్యత ఉందని, డ్రగ్స్ వాడుతూ చట్టాన్ని ఎవరు అతిక్రమించినా శిక్షార్హులేనని ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు ఈ రోజు మీడియాకు స్పష్టంచేశారు.