Begin typing your search above and press return to search.
మెగాస్టార్ తో స్టెప్పు కలపాలని సల్మాన్ లో ఉత్కంఠ
By: Tupaki Desk | 14 Nov 2021 2:33 PM GMTమెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా గాడ్ ఫాదర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకుడు. శరవేగంగా చిత్రీకరణ సాగుతోంది. మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ కి రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ ప్రత్యేక పాత్రను పోషిస్తున్నాడు. అతను ఒరిజినల్ లో మోహన్ లాల్ అనుచరుడిగా పృథ్వీరాజ్ చేసిన పాత్రను పోషించనున్నాడు.
అయితే చిరు- సల్మాన్ జోడీని తెరపై వైబ్రేంట్ గా ఆవిష్కరించేందుకు ఉన్న ఏ అవకాశాన్ని విడిచిపెట్టేందుకు దర్శకుడు మోహన్ రాజా సిద్ధంగా లేడు. తాజా సమాచారం మేరకు.. చిరు-సల్మాన్ కలిసి స్టెప్పులతో అలరించేలా ఓ ప్రత్యేక పాటను ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఈ పాట కోసం స్వరకర్త థమన్ బ్రిట్నీ స్పియర్స్ వంటి ప్రముఖ హాలీవుడ్ పాప్ స్టార్ ని తీసుకురావాలనుకుంటున్నారు. అయితే ఇంగ్లీషు పాట కంటే హిందీ పాటే బాగుంటుందని సల్మాన్ అభిప్రాయపడినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పాటను బాలీవుడ్ మాస్ మసాలా సాంగ్ తరహాలో రూపొందిస్తే బావుంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు దీనిపై ఓ అవగాహన కోసం చిరు-థమన్ ఇద్దరితో భాయ్ టచ్ లో ఉన్నట్లు సమాచారం.
నిజానికి ఇంగ్లీష్ పాప్ సాంగ్ తరహా అయితే బావుంటుందని చిరు టీమ్ భావిస్తోంది. కానీ సల్మాన్ మాటకు గౌరవమిచ్చి హిందీ మిక్స్ డ్ వెర్షన్ తో సాంగ్ ని మోడ్రనైజ్ చేస్తారా? అన్నది ఆసక్తిగా మారింది. అటు భాయ్ ని నిరాశపరచకుండా ఇంగ్లీష్ హిందీ పదాలతో మ్యాజిక్ చేసే ఏదైనా విభిన్నమైన పాటను ఎంపిక చేస్తారా? అన్నది కూడా వేచి చూడాలి. ఇక సల్మాన్ తో కలిసి చిరు స్టెప్పులేస్తే అది సల్మాన్ ఫ్యాన్స్ కి చిరు ఫ్యాన్స్ కి కన్నుల పండుగే అనడంలో ఎలాంటి సందేహం లేదు.