Begin typing your search above and press return to search.

మహేష్ నానమ్మను గుర్తుచేసుకున్న దత్తుగారు

By:  Tupaki Desk   |   13 May 2019 7:52 AM GMT
మహేష్ నానమ్మను గుర్తుచేసుకున్న దత్తుగారు
X
సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం 'మహర్షి' మే 9 న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రైతుల సమస్యను గురించి చర్చించడం.. మనం రోజూ తినే అన్నాన్ని పండించే రైతుకు మనం గౌరవం ఇవ్వాల్సిందేనని చెప్పడం.. చాలామంది ప్రేక్షకులకు కనెక్ట్ అవుతోంది. ఇక ఈ సినిమాలో సూచించిన వీకెండ్ ఫార్మింగ్ కూడా చాలామంది పట్టణ.. నగర యువతకు ప్రేరణనిస్తోంది. ఇదిలా ఉంటే 'మహర్షి' సక్సెస్ మీట్ లో నిర్మాత అశ్వినీ దత్ గారు మాట్లాడుతూ మహేష్ కు రైతు కుటంబ మూలాలు ఉన్నాయని వివరించారు.

ఆయన కృష్ణ గారి గురించి చెప్తూ "కృష్ణగారి సూపర్ హిట్ సినిమాలో ఎక్కువ భాగం రైతు నేపథ్యంలో తెరకెక్కినవే. నాకు గుర్తుండిపోయిన విషయం ఒకటి ఉంది. నేనెప్పుడు కృష్ణ గారిని కలవాడానికి వెళ్ళినా.. కృష్ణ అమ్మగారు నాగరత్నమ్మ గారిని కలిసే వాడిని. ఆవిడ ఎప్పుడూ నాకు ఒకే విషయం గురించి చెప్పేవారు. ఒక రైతు ఎంత కష్టపడతారు.. తను రైతుగా ఎంత కష్టపడ్డారు.. ఎన్ని రకాల పంటలు పండించారు అనేది చెప్తూ ఉండేవారు. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన మహేష్ బాబు కరెక్ట్ గా తన 25 వ సినిమాకు వంశీ పైడిపల్లి తీసుకొచ్చిన రైతు నేపథ్యం ఉన్న సినిమాను ఎంచుకోవడం చాలా గొప్ప విషయం" అన్నారు.

అంతే కాదు.. చాలా సినిమాలు విజయం సాధిస్తాయని కానీ సినిమాకు పనిచేసినవారికి గౌరవం తీసుకొచ్చే సినిమాలు మాత్రం అరుదుగా ఉంటాయని.. 'మహర్షి' అలాంటి చిత్రమేనని చెప్పారు దత్. ఆ విషయంలో మాత్రం 'మహర్షి' సక్సెస్ అయిందని మనం ఒప్పుకోవాల్సిందే.