Begin typing your search above and press return to search.
పవర్ స్టార్ సినిమా కోసం అదిరిపోయే సెట్స్
By: Tupaki Desk | 21 Jan 2022 6:17 AM GMTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడేళ్ల విరామం తరువాత `వకీల్ సాబ్` చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. దిల్ రాజు తన 25 ఏళ్ల డ్రీమ్ ని ఫుల్ ఫిల్ చేసుకునే ప్రయత్నంలో శ్రీరామ్ వేణు డైరెక్షన్ లో ఈ మూవీని నిర్మించారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ `పింక్` ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఆశించిన స్థాయికి మించి కోవిడ్ వంటి విపత్కర సమయంలోనూ థియేటర్లలో సంచలనం సృష్టించింది. సెకండ్ వేవ్ ఉదృతంగా వున్న సమయంలో విడుదలైన ఈ చిత్రం పవన్ కెరీర్‌లో భారీ వసూళ్లని రాబట్టిన చిత్రంగా నిలించింది.
ఈ మూవీ అందించిన సక్సెస్ జోష్‌తో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుసగా సినిమాల్ని లైన్ లో పెట్టారు. ప్రస్తుతం `భీమ్లా నాయక్`ని పూర్తి చేశారు. కొంత ప్యాచ్ వర్క్ మినహా ఈ మూవీ చిత్రీకరణ దాదాపుగా పూర్తయింది. పవన్ కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు మినహా సినిమా మొత్తం కంప్లీట్ అయింది. ఈ మూవీ తరువాత పవర్ కల్యాణ్ తన దృష్టిని క్రిష్ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ జానపద చిత్రం `హరి హర వీరమల్లు` పై పెట్టారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ మూవీని ఏ.ఎం. రత్నం, ఏ. దయాకర్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలోని కీలక పాత్రల్లో బాలీవుడ్ నటులు అర్జున్ రాంపల్, నర్గీస్ ఫక్రీ, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్, పూజిత పొన్నాడ (స్పెషల్ సాంగ్) నటిస్తున్నారు. 17 వ శతాబ్దం మొఘల్ సామ్రాజ్యం నాటి కథ నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగనుంది. ఇందులో పవన్ కల్యాణ్ బందిపోటు దొంగగా కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింస్ టీజర్ సినిమా పై అంచనాల్ని పపెంచేసింది. అంతే కాకుండా హరి హరి వీరమల్లు పాత్రలో పవన్ మేకోవర్ కూడా ఆకట్టుకుంటోంది.
ఇప్పటికే 60 వాతం చిత్రీకరణ పూర్తియింది. కరోనా కారణాం గత కొన్ని నెలలుగా ఆలస్యం అవుతున్న ఈమూవీ చిత్రీకరణ తాజా షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ కోసం ప్రత్యేకంగా అదరిఇపోయే సెట్స్ ని వేస్తున్నారు. ఢిల్లీ లోని వాణిజ్య ప్రాంతమైన చాందినీ చౌక్ ని తలపించే విధంగా ఆ ప్రాంతాన్ని రీక్రియేట్ చేస్తున్నారు. ఈ సెట్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవ నుందట. మొఘల్ సామ్రాజ్య కాలంలో విస్సయిన కోహినూర్ వజ్రం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందిని, నర్గీస్ ఫక్రీ మొఘల్ సామ్రాజ్య రాకుమారిగా కీలక పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది.
చాందినీ చౌక్ సెట్ లో కీలక ఘట్టాలని పూర్తి చేసి సినిమాని ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకుడు క్రిష్ ప్లాన్ చేస్తున్నారు. అయితే కోవిడ్ పరిస్థితులు ఎంత వరకు ఈ సినిమాకు ప్రతి బంధకంగా నిలుస్తాయో.. ఎంత వరకు అనుకూలిస్తాయో చూడాలని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. `భీమ్లా నాయక్` చిత్రీకరణ పూర్తి కావడంతో పవన్ కల్యాణ్ `హరి హర వీరమల్లు`తో పాటు `భవదీయుడు భగత్ సింగ్` ని కూడా పట్టాలెక్కించాలని, ఈ రెండు చిత్రాలని ఒకే సారి పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ ప్లాన్ ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి మరి.