Begin typing your search above and press return to search.
ఉత్కంఠ కలిగిస్తున్న కమల్ హాసన్ నెక్ట్స్ సినిమా స్టోరి
By: Tupaki Desk | 2 July 2023 3:00 PM GMTవిశ్వనటుడు కమల్ హాసన్ బ్యాక్ టు బ్యాక్ సంతకాలతో కెరీర్ పరంగా దూకుడు ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. హెచ్. వినోద్ తో కమల్ హాసన్ తదుపరి చిత్రం గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ సినిమా కథాంశం ఎత్తుగడ ఆద్యంతం ఉత్కంఠ కలిగించనుందనేది తాజా సమాచారం. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభం కానుంది? అసలు కథాంశం ఏమిటి? అన్న వివరాల్లోకి వెళితే.. గతేడాది విడుదలైన `విక్రమ్`తో నటుడిగా కమల్ హాసన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ చిత్రంగా నిలిచింది. ఈ విజయం కమల్ హాసన్ ని మరింత ఉత్సాహపరిచింది. ఇటీవల నటుడిగా నిర్మాతగా తదుపరి చిత్రాలకు కమిట్ అవుతూనే ఉన్నాడు. ప్రస్తుతం కమల్.. శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 సినిమాలో నటిస్తున్నాడు. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల చేయనున్నట్టు చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఉదయనిధి ఇటీవల తన ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే ఇండియన్ 3కి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయంటూ కథనాలు రావడంతో అభిమానుల్లో ఉత్సాహం కనిపించింది.
నిజానికి భారతీయుడు 2 తర్వాత కమల్ .. హెచ్ వినోద్ సహా మణిరత్నం దర్శకత్వంలో నటించనున్నాడని కథనాలొస్తున్నాయి. ఇంతలోనే ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ప్రాజెక్ట్ K లో విలన్ గా కమల్ హాసన్ ఎంపికయ్యారు. ఈ సినిమాకి కాల్షీట్లు ఇచ్చిన కమల్ హాసన్ భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. భారతీయుడు 2 పూర్తి చేసిన తర్వాత హెచ్ వినోద్ దర్శకత్వంలో సెట్స్ పై కమల్ జాయిన్ అవుతాడని గతంలో కథనాలొచ్చినా కానీ..ఈ ప్రాజెక్ట్ కొంత ఆలస్యమవుతుందని తాజాగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం హెచ్ వినోద్ కి మరో సామాజిక చిత్రం కానుందని తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ చివరి దశలో ఉన్నట్లు కూడా కథనాలొస్తున్నాయి. అయితే బిగ్ బాస్ షో విషయంలో కమల్ హాసన్ కమిట్ మెంట్ కారణంగానే హెచ్ వినోద్ ప్రాజెక్ట్ ఆలస్యమవుతుందని పలువురు అంటున్నారు. బిగ్ బాస్ తమిళ సీజన్ 7 పూర్తయిన తర్వాతే ఈ చిత్రం ప్రారంభమవుతుందని భావిస్తున్నారు.
విజయ్ సేతుపతి- యోగి బాబు కూడా ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తారని పుకార్లు వచ్చాయి అయితే ఈ చిత్రం పై అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. ఇంకా ఈ సినిమా ప్రారంభం కాకుండానే.. డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తానికి సొంతం చేసుకుందని కూడా కథనాలొస్తున్నాయి. ఈ సినిమా షార్ట్ టర్మ్ ప్రొడక్షన్ గా రూపొందుతుండగా వచ్చే ఏడాది ప్రారంభంలో మణిరత్నం సినిమా షూటింగ్ లో కమల్ జాయిన్ అవుతాడని కూడా అంటున్నారు.
కీలకమైన ఆ సమస్య చుట్టూ కథాంశం:
కమల్ హాసన్ కథానాయకుడిగా హెచ్ వినోద్ తెరకెక్కించే సినిమా కథాంశంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ సినిమా కూడా వినోద్ గత చిత్రాల తరహాలోనే సామాజికాంశాలతో రక్తి కట్టించనుంది. ఇందులో నేటి దారుణ సన్నివేశంలో వ్యవసాయం పతనావస్థ.. రైతుల వెతలను తెరపై ఆవిష్కరించనున్నారని.. కేంద్రంలోని భాజపా-ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేక కంటెంట్ తో పుల్ చేసిన కథ ఇదని రకరకాలుగా చర్చ సాగుతోంది. నిజానికి కమల్ ఎన్డీఏ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నారు. రైతుల విషయంలో వారికి మద్ధతుగా నిలుస్తూ కేంద్రప్రభుత్వ తీరు తెన్నులను ఎండ గడుతున్నారు. రాజకీయంగా యాక్టివ్ గా ఉన్న కమల్ హాసన్ ఇప్పుడు ఇంచుమించి రియాలిటీకి దగ్గరగా ఉన్న కథాంశాన్ని ఎంచుకోవడం ఉత్కంఠను కలిగిస్తోంది.
రాజకీయాలు ఒక ప్రధాన కారణం:
కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యమ్ (MNM) 2019 లోక్ సభ ఎన్నికలలో ఘోరంగా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. కమల్ హాసన్ రాజకీయ జూదం ఫలించలేదు. మక్కల్ నీది మయ్యమ్ (MNM) కోయంబత్తూరు సౌత్ లో మాత్రమే ఆధిక్యం సాధించింది. ఇక్కడ హాసన్ స్వయంగా అభ్యర్థి. అయితే కౌంటింగ్ ముగిసే సమయానికి ఆ సీటును పార్టీ కోల్పోయింది. భాజపా అభ్యర్థి చేతిలో కమల్ ఓటమి పాలయ్యారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యం పార్టీకి ఎన్నికల సంఘం టార్చ్‌లైట్ గుర్తును కేటాయించింది. దాదాపు 220 పైగా సీట్లకు పోటీ చేసినా కానీ ఫలితం ఆశించిన విధంగా రాలేదు. అయితే MNM పనితీరు గత లోక్ సభ ఎన్నికలలో కొంత మెరుగైంది. హాసన్ పార్టీ 3.72 శాతం ఓట్ షేర్ ను గెలుచుకుంది. పార్టీకి 14 నెలల వయస్సు ఉన్నప్పుడే ఈ ఘనత సాధించింది. పట్టణ ఓటర్లలో గణనీయమైన సెగ్మెంట్ లో కమల్ కు ఉన్న ఆదరణ కారణంగా ఈ విజయం సాధ్యమైంది. కమల్ తన వ్యాఖ్యల్లో నిరంతరం డీఎంకే పార్టీ సహా భాజపాను టార్గెట్ చేస్తున్నారు.