Begin typing your search above and press return to search.
తారక్, చరణ్ 'RRR' అందుకే చేశారట
By: Tupaki Desk | 1 Jan 2022 7:32 AM GMT`RRR`.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వినిపిస్తున్న మాట ఇది. పాన్ ఇండియా స్థాయిలో సగటు సినీ ప్రేక్షకుడిని కదిలించినా వినిపిస్తున్న ఒకే ఒక్క మాట `RRR`. `బాహుబలి` వంటి అత్యంత సంచలన సినిమా తరువాత రాజమౌళి నుంచి వస్తున్న మూవీ కావడం, ఇందులో తొలి సారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమా కావడంతో ఈ చిత్రంపై సహజంగానే అంచనాలు ఆకాశాన్నంటాయి.
అంతే కాకుండా చరిత్రలో నిలిచిపోయిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, గోండు బెబ్బులి కొమురం భీం వంటి ఇద్దరు లెజెండ్ ల కథలకు ఫిక్షనల్ అంశాలని జోడించి ప్రీ ఇండిపెండెంట్ కాలం నాటి పరిస్థితులని తెరపై ఆవిష్కరించి ఓ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దీంతో ఈ సినిమాలో ఆ పాత్రల్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎలా నటించారా? అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. దీంతో దేశ వ్యాప్తంగా ఈ మూవీపై అంచనాలు స్కై హైకి చేరుకున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 14 భాషల్లో విడుదలవుతున్న ఈ మూవీ ప్రమోషన్స్ కోసం మేకర్స్ ఏకంగా 20 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్ర ప్రచారాన్ని దేశ వ్యాప్తంగా వివిధ భాషల్లో హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్, దర్శకుడు రాజమౌళి హోరెత్తిస్తున్నారు. ఈ సందర్భంగా పలు మీడియా సంస్థలకు, ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. పలు ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడిస్తున్నారు.
తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్, ఎన్టీఆర్ పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. అసలుఈ ప్రాజెక్ట్ ఎందుకు చేయాల్సి వచ్చింది. దాని వెనకున్న కథేంటో బయటపెట్టేశారు. ఓ మీడయాకిచ్చిన ఇంటర్వ్యూలో మీరు ఏ కారణం చేత ఈ ప్రాజెక్ట్ అంగీకరించాల్సి వచ్చిందని ప్రశ్నిస్తే ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. అంతే కాకుండా చిత్ర కథ నచ్చడం వల్లే ఈ సినిమా ఓకే చేశారా? లేక రాజమౌళి దర్శకుడు కావడం వల్లే ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా అని ప్రశ్నిస్తే కొత్త విషయాన్ని బయటపెట్టారు.
రాజమౌళి కాబట్టే ఈ సినిమా అంగీకరించామని చెప్పిన చరణ్, ఎన్టీఆర్.. రాజమౌళి సినిమా కథలు ఎలా వుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ కథ మాకు బాగా కుదురుతుంది అన్నప్పుడే రాజమౌళి దాన్ని మా వద్దకు తీసుకొస్తాడు. అది మాకు బాగా తెలుసు. సినిమా చేయాలని రాజమౌళి కాల్ చేసినప్పుడే కథ ఏంటన్నది అగడకుండానే సినిమా ఫైనల్ చేశాం` అని అసలు విషయం చెప్పారు. అత్యంత భారీ స్థాయిలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 7న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. దాదాపు 14 భాషల్లో ఈ మూవీని విడుదల చేస్తున్నారు.
400 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అలియాభట్, హాలీవుడ్ నటి ఒలివియా మోరీస్ హరీఓయిన్ లు గా నటిస్తున్న విషయం తెలిసిందే. కీలక పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని, హాలీవుడ్ నటులు రేస్టీవెన్ సన్, అలీసన్ డూడీ కనిపించబోతున్నారు.