Begin typing your search above and press return to search.

ఎక్స్ క్లూసివ్ - ప‌ది ఫ్లాపులు త‌రువాత ఒక్క స‌క్సెస్ వ‌చ్చినా స‌రే

By:  Tupaki Desk   |   2 Jun 2020 4:58 AM GMT
ఎక్స్ క్లూసివ్ - ప‌ది ఫ్లాపులు త‌రువాత ఒక్క స‌క్సెస్ వ‌చ్చినా స‌రే
X
*హాయ్ అభిషేక్ ముందుగా మీకు కంగ్రాట్స్ డిస్ట్రీబ్యూట‌ర్ గా వంద సినిమాలు పూర్తి చేసుకున్నందుకు

థ్యాంక్యూ ఎలా ఉన్నారు

*ఐయామ్ ఫైన్, 100 సినిమాలు చాలా చిన్న ఏజ్ లో పూర్తి చేసుకున్న‌ట్లున్నారు

అవునండి, ఐయామ్ ది యంగెస్ట్ డిస్ట్రీబ్యూట‌ర్ టు ఎచీవ్ దిస్ ఫీట్, అయితే చాలా కాస్ట్ లీ లెర్నింగ్ అండ్ ఎచీవ్మెంట్ ఇది (న‌వ్వులు)

* కాస్ట్ లీ అంటే మీరు డిస్ట్రీబ్యూట్ చేసిన ఫ్లాప్ సినిమాలు గురించేనా

అదేగా, అస‌లు డిస్ట్రీబ్యూష‌న్ ఫీల్డ్ లో ఉన్నంత రీస్క్, టెన్ష‌న్ ఇంకే సినిమా సెక్టార్ లో ఉండ‌దు, అయితే ఇదే నాకు ఛాలెంజింగ్ గా అనిపించి ఈ క్రాఫ్ట్ లోకి ఎంట‌రై, ఆడియెన్స్ కి నా వంతుగా ఎంట‌ర్ టైన్మెంట్ ఇస్తున్నా

* ఫ్లాపులు గురించి మీరే డిస్కష‌న్ స్టార్ట్ చేశారు కాబ్బ‌ట్ట ఈ ప్ర‌శ్న‌, అస‌లు ఫ్లాప్ కి మీరిచ్చే డెఫినిష‌న్ ఏంటి

నా వ‌ర‌కు మాత్రం ఫ్లాప్ కి సింపుల్ డెఫిష‌న్ అంటే డ‌బ్బులు రాని సినిమా. సినిమా ఎంత బాగున్నా, థియేట‌ర్ కి ఆడియెన్ రాక‌పోతే నా దృష్టిలో అది ఫ్లాప్ సినిమానే

* మీ పాయింట్ ఆఫ్ వ్యూలో క‌రెక్టే, కానీ బావుండి కూడా క‌మ‌ర్షీయ‌ల్ స‌క్సెస్ లు అవ్వ‌ని సినిమాలు చాలా ఉన్నాయి క‌దా

నిజ‌మే అందుకే మ‌న‌కి స‌క్సెస్ రేట్ చాలా త‌క్కువ ఉంది, క‌మర్షీయ‌ల్ స‌క్సెస్ అయిన సినిమాల్నే ట్రేడ్ వారు రియ‌ల్ స‌క్సెస్ లు ప‌రిగ‌ణిస్తారు, ఎండ్ ఆఫ్ ది మ‌నంద‌రం డ‌బ్బులు కోస‌మే ప‌నిచేస్తాము క‌దా

* సినిమాల్లో నిల‌బ‌డాలంటే డ‌బ్బుతో పాటు ప్యాష‌న్ కూడా అవ‌స‌ర‌మే క‌దా

డ‌బ్బు, ప్యాష‌న్ కాదు ఇక్క‌డ నిల‌బ‌డాలంటే ముందు స‌క్సెస్ కావాలి, ఆ త‌రువాతే మిగ‌తావి అన్ని ప‌రిగ‌ణ‌లోకి వ‌స్తాయి. డ‌బ్బులున్న చాలా మంది నిర్మాత‌లు, స‌క్సెస్ లు లేక ఇండస్ట్రీలో నిల‌దొక్కులేక‌పోతున్నారు, డ‌బ్బులేని వారు త‌మ టాలెంట్ అండ్ స‌క్సెస్ తో ఇండ‌స్ట్రీలో చాలా త్వ‌ర‌గా ఫేమ్ లోకి వ‌చ్చేస్తున్నారు. ఒక్క విష‌యం మాత్రం మీరు చెప్పింది నిజం, ఇలాంటి క్రియేటివ్ బిజినెస్ కి ప్యాషన్ కూడా చాలా అవ‌స‌రం

* డిస్ట్రీబ్యూట‌ర్ గానే కాదు నిర్మాత‌గా కూడా కొన్ని సార్లు రాంగ్ స్టెప్స్ వేశారు, రైట్ స్టెప్స్ వేశారు, మ‌రి డైరెక్ష‌న్ లోకి కూడా వ‌చ్చే ఛాన్స్ ఉందా

అస్స‌లు లేదండి, నిజానికి నేను నిర్మాత‌గా కూడా ఉండ‌టానికి పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌ను, ఎందుకంటే డిస్ట్రీబ్యూట‌ర్ గా ఉంటే వారానికో సినిమాని రిలీజ్ చేయోచ్చు, అదే నిర్మాత‌గా ఉంటే మాత్రం ఏడాదికో సినిమా నాకు కంటిన్యూగా సినిమాలు చేయ‌డ‌మే ఇష్టం, సో ప్రొడ‌క్ష‌న్ ఆర్ డిస్ట్రీబ్యూష‌న్ అంటే మాత్రం నా ఓటు డిస్ట్రీబ్యూష‌న్ కే వేస్తాను.

* అన్ని సెక్టార్స్ కంటే డిస్ట్రీబ్యూష‌న్ చాలా పెద్ద రిస్క్ ఫీల్డ్ క‌దా, ఎందుక‌నే ఈ దారిని ఎంచుకున్నారు

రిస్క్ కానీ ప‌ది ఫ్లాపులు త‌రువాత ఒక్క స‌క్సెస్ వ‌చ్చినా స‌రే, ఆ పాజిటివ్ ఫీలింగ్ మ‌ళ్లీ 100 సినిమాలు డిస్ట్రీబ్యూట్ చేసేంత ఎన‌ర్జీ ఇస్తుంది. రిస్క్ ని ప‌క్క‌న పెడితే ఈ ఫీల్డ్ లో బిజినెస్ త‌ప్ప నాకు వేరే ప‌ని రాదు.

* ఓటీటీ కార‌ణంగా ముందుగా ఎఫెక్ట్ ప‌డేది డిస్ట్రీబ్యూష‌న్ మీద‌నే క‌దా, ఓటీటీల‌కు నిర్మాత‌లు కూడా స‌హాక‌రిస్తున్నారు, దీని పై మీ స్పంద‌న‌

ఓటీటీలు ప్ర‌స్తుతం ప‌రిస్థితుల్ని ఎడ్వాంటేజ్ గా తీసుకుని ఆడుతున్న గేమ్ ఇది, థియేటర్ ఎక్స్ పీరియ‌న్స్ కావాల‌న‌కునే ఆడియెన్స్ క‌చ్ఛితంగా సినిమాను థియేట‌ర్ లోనే చూస్తారు. క‌రోనా ప్ర‌భావం త‌గ్గిన వెంట‌నే అన్ని సద్ధుకుంటాయి. ఇక నిర్మాత‌లు ఓటీటీ ప్రస్తుతం స‌పోర్ట్ చేయాలి వారికి వేరు దారి లేదు. థియేట‌ర్స్ లాక్ డౌన్ లో ఉండ‌టం, సినిమాలు రిలీజ్ లు ఆగిపోవ‌డంతో ర‌క‌ర‌కాల ఫైనాన్స్ ఇబ్బందులు వారికి ఉంటాయి. అందుకే ఓటీటీల్లో వారు సినిమాలు రిలీజ్ చేసి, కాస్త ఆర్థిక ఇబ్బుందులు నుంచి బ‌య‌ట‌ప‌డే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. థియేట‌ర్ల మీద ఆంక్ష‌లు ఎత్తేసిన వెంట‌నే వారు, త‌మ సినిమాలు రిలీజ్ ల‌ను ఓటీటీల్లో కాకుండా థియేట‌ర్స్ లోనే రిలీజ్ చేస్తార‌ని నేను న‌మ్ముతున్నాను.

* క‌రోనా అన్న‌ది ఓ కార‌ణం అని, అస్స‌లు డిస్ట్రీబ్యూష‌న్ ఫీల్డ్ లో చాలా ఆర్థిక అవ‌క‌త‌వ‌క‌లు కార‌ణంగానే నిర్మాత‌లు ఓటీటీలు వైపు వెళ్తున్నారు అనే వాద‌న ఉంది, నిజ‌మేనా

దాదాపు ఇది నిజ‌మే అయితే దీనికి సింపుల్ సొల్యూష‌న్ ఉంది, టికెటింగ్ విధానం మొత్తం ఆన్ లైన్ లోనే జ‌ర‌గాలి. ప్ర‌తి షో అయిపోయిన వెంటనే అక్క‌డ వ‌చ్చే రెవెన్యూ డిటేట్స్ మొత్తం నిర్మాత‌లకు వెళ్లిపోవాలి. అప్పుడే డిస్ట్రీబ్యూష‌న్ వ్య‌వ‌స్థ మీద వ‌స్తున్న అపోహ‌లు, ఆరోప‌నులు తొలిపోతాయి. అయితే తెలుగులో ఇది జ‌ర‌గ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంది. అంత‌వ‌రుకు ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్ని డిస్ట్రీబ్యూట‌ర్లు భ‌రించాల్సిందే.

* మీరు అనుకున్న‌ట్లుగా ఫిల్మ్ ట్రేడ్ మొత్తం ఆన్ లైన్ అవ్వాల‌ని, మీరు మ‌రిన్ని మంచి సినిమాలు డిస్ట్రీబ్యూట్ చేయాల‌ని తుపాకీ డాట్ కామ్ మ‌నఃస్పూర్తిగా కోరుకుంటుంది, ఆల్ ది బెస్ట్

తుపాకీ డాట్ కామ్ రీడ‌ర్స్ అంద‌రూ స్టే హోమ్ స్టే సేఫ్, థ్యాంక్యూ, ఆల్ ది బెస్ట్