Begin typing your search above and press return to search.
థియేట్రికల్ రిలీజ్ కోసం స్టార్ హీరోతో సమావేశమైన ఎగ్జిబిటర్స్ - డిస్ట్రిబ్యూటర్స్..?
By: Tupaki Desk | 8 Dec 2020 3:30 AM GMTకరోనా మహమ్మారి కారణంగా గత కొన్ని నెలలుగా థియేటర్ ఓనర్స్ - ఎగ్జిబిటర్స్ - డిస్ట్రిబ్యూటర్స్ తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. 50 శాతం సీటింగ్ ఆక్యుపెన్సీతో థియేటర్స్ ఓపన్ చేసుకోడానికి కేంద్రం అనుమతి ఇవ్వడంతో తమిళనాడులో పాక్షికంగా థియేటర్స్ రీ ఓపెన్ అయ్యాయి. అయితే ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని తెలుస్తోంది. దీంతో థియేటర్ ఓనర్స్ ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఏదైనా స్టార్ హీరో సినిమా విడుదల చేస్తే తప్ప థియేటర్ నిండే అవకాశం లేదని భావిస్తున్నారని తెలుస్తోంది. అలానే స్టార్ హీరో సినిమాకి హౌస్ ఫుల్స్ వస్తే కరోనా భయం పోయి మిగతా చిన్న మీడియం రేంజ్ సినిమాలకి కూడా ఆడియన్స్ వస్తారని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ని కలిసి 'మాస్టర్' సినిమాని రిలీజ్ చేయాలని కోరినట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
'ఇళయదళపతి' విజయ్ హీరోగా.. 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా నటించిన మూవీ ''మాస్టర్''. 'ఖైదీ' ఫేమ్ లోకేష్ కనకరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ మంచి స్పందన తెచుకోవడంతో 'మాస్టర్' సినిమాపై టాలీవుడ్ లో కూడా మంచి అంచనాలే ఏర్పడ్డాయి. నిజానికి లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన 'మాస్టర్' చిత్రాన్ని దసరా కానుకగా రిలీజ్ చేస్తారని.. ఆ తర్వాత దీపావళికి రిలీజ్ చేస్తారని.. సంక్రాంతికి విడుదల వార్తలు వచ్చాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేట్రికల్ రిలీజ్ కి వెళ్తే రిటర్న్స్ రావేమో అనే అనుమానంతో వెనకడుగుకు వేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో 'మాస్టర్' ని పొంగల్ సీజన్ లో రిలీజ్ చేయమని ఎగ్జిబిటర్స్ - డిస్ట్రిబ్యూటర్స్ విజయ్ ని కోరారట. దీనికి అంగీకరించిన విజయ్.. 'మాస్టర్' ని సంక్రాంతికి తీసుకొచ్చే ఆలోచన చేయమని సూచించారని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.