Begin typing your search above and press return to search.

సినిమాలకూ మంత్లీ పాసులు వస్తున్నాయ్

By:  Tupaki Desk   |   27 Dec 2017 6:42 AM GMT
సినిమాలకూ మంత్లీ పాసులు వస్తున్నాయ్
X
మనం ఇప్పటివరకూ రకరకాల పాసులు చూశాం. స్టూడెంట్ పాస్ లు.. బస్ పాస్ లు.. ట్రైన్ పాస్ లు.. ఇలా రకరకాల కేటగిరీల్లో పాస్ లను దాదాపు అందరూ ఉపయోగించుకునే ఉంటారు. ఇప్పుడు ఓ కొత్త విధానాన్ని అమలు చేసేందుకు సినిమా ఎగ్జిబిటర్లు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

సినిమా థియేటర్లకు కూడా పాస్ లను ఇచ్చే అంశంపై పరిశీలనలు జరుగుతున్న విషయాన్ని ఎగ్జిబిటర్లు ధృవీకరిస్తున్నారు కూడా. ఇండివిడ్యువల్.. ఫ్యామిలీ.. అంటూ రెండు రకాల కేటగిరీల్లో సినిమా థియేటర్ ఎంట్రీ పాస్ లను ఆఫర్ చేసే యోచనలో.. ఎగ్జిబిటర్స్ ఉన్నారట. ఇందుకు ప్రధాన కారణం.. థియేటర్లకు వచ్చే జనాలు తగ్గిపోవడమే. ఈ ఏడాది వసూళ్ల పరంగా బాగా వసూళ్లు సాధించిన రికార్డులు నమోదు అయినా.. థియేటర్లకు వచ్చే జనాల సంఖ్య బాగా తగ్గిందట. ఇది ఇలాగే కంటిన్యూ అయితే.. రాబోయే కాలంలో థియేటర్ల నిర్వహణ కూడా కష్టమైపోతుందని భావిస్తున్నారట.

ఆదివారాలు కూడా థియేటర్లు ఫుల్ కాకపోవడం చాలామందిని ఆలోచనలో పడేస్తోందని అంటున్నారు. అందుకే నెలవారీ పాస్ లు ఇవ్వాలని ఇండివిడ్యువల్ పాస్ ను రూ. 500 -800 మధ్య నిర్ణయించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ పాస్ ను తీసుకున్న వారు ఆ నాలుగు వారాల్లో ఎన్ని సినిమాలు అయినా చూసే అవకాశం ఉంటుందట. మరి ఇది కార్యాచరణలోకి వస్తుందో లేదో తెలీదు కానీ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మంత్లీ పాస్ ల విధానం అమలు చేసేందుకు గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయని తెలుస్తోంది.

ఇలా పాస్ ల ద్వారా వచ్చిన మొత్తాన్ని డిస్ట్రిబ్యూటర్లు- ఎగ్జిబిటర్లు పంచుకునే విధంగా సమాలోచనలు చేస్తున్నట్లు.. డిస్ట్రిబ్యూటర్ కం ప్రొడ్యూసర్ అయిన సురేష్ బాబు చెబుతున్నారు. మూవీ లవర్స్ ను థియేటర్ల బాట పట్టించేందుకు ఈ పాస్ ల విధానం ఉపయోగపడుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి.