Begin typing your search above and press return to search.
ఏపీ ప్రభుత్వం పై ఎగ్జిబిటర్స్ వార్?!
By: Tupaki Desk | 23 Dec 2021 5:09 AM GMTగడిచిన కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సినీపరిశ్రమ ప్రముఖులు సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినిమా టిక్కెట్ల ధరల విషయంలో జగన్ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుండడంతో తీవ్ర నిరాశ నిస్పృహలు వ్యక్తమవుతన్నాయి. ఇలా అయితే థియేటర్లు మూసేయాల్సిందేనని కళ్యాణ మంటపాలుగా ఫంక్షన్ హాళ్లుగా మార్చుకుని ఇతర ఆదాయ మార్గాల్ని వెతుక్కోవాలని భావిస్తున్నారు. సింగిల్ థియేటర్లలో ఇప్పటికే చాలా థియేటర్లు మూత పడ్డాయి. మిగిలినవి ఉంటాయా లేదా? అన్నదానిపై సందిగ్ధత నెలకొంది.
థియేటర్ల టిక్కెట్ ధరలు గిట్టుబాటు కాలేదు. అదనపు షోల ప్రదర్శనపైనా ఏపీ ప్రభుత్వం ఉక్కు పాదం మోపింది. ఇతర సమస్యలపై కఠినమైన వైఖరిని అవలంబించడంతో థియేటర్ యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయి. కొన్నాళ్లుగా నిబంధనలను ఉల్లంఘించిన థియేటర్లపై ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ ధరలకు టిక్కెట్లను విక్రయించినట్టు తెలిస్తే చర్యలు తీసుకుంటోంది. అదనపు షోలను నడిపే వారికి అనుమతులు రద్దు చేస్తోంది. థియేటర్లలో అధికారులు తనిఖీలు నిర్వహించి అధిక ధరలకు చిరుతిళ్లు.. శీతల పానీయాలు విక్రయిస్తున్న వారితో పాటు పార్కింగ్ టికెట్ ధరలపైనా నజర్ చూపించారు. సరైన ఎయిర్ కండిషనింగ్ లేకపోయినా.. అగ్నిమాపక భద్రతా పరికరాలు వంటి సౌకర్యాలు లేకున్నా వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఉత్తర-కోస్తా ఆంధ్ర -రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో ఇటువంటి అనేక థియేటర్లకు గత కొన్ని రోజులుగా తాళాలు పడ్డాయని తెలిసింది.
ఇకపై వరుసగా భారీ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. నాని శ్యామ్ సింగరాయ్ సహా సంక్రాంతి బరిలో భారీ పాన్ ఇండియా చిత్రాలు క్యూలో ఉన్నాయి. వీటిలో రాజమౌళి RRR.. ప్రభాస్ - రాధేశ్యామ్ .. పవన్ -రానా ల మల్టీస్టారర్ భీమ్లా నాయక్ సంక్రాంతి 2022కి సందడి చేయనున్నాయి. ఈలోగానే నాగార్జున-చైతన్యల బంగార్రాజు కూడా విడుదలకు రానుంది. ఇంకా పలు క్రేజీ చిత్రాలు క్యూలో ఉన్నాయి. అయితే ఇప్పటిలానే జగన్ ప్రభుత్వం తన నిబంధనలను సడలించకపోతే తాము తీవ్ర సంక్షోభంలో పడతామని ఎగ్జిబిటర్లు ఆందోళనలో ఉన్నారు.
తాజా గుసగుసల ప్రకారం.. దీనిని ఇలానే ఉపేక్షిస్తే సమస్య పెరుగుతోందే కానీ తగ్గడం లేదని ఎగ్జిబిటర్లు భావిస్తున్నారు. తమ సమస్యలపై చర్చించడానికి .. భవిష్యత్తు కార్యాచరణను రూపొందించడానికి గురువారం విజయవాడలో సమావేశానికి పిలుపునిచ్చారు. టిక్కెట్ ధరల పెంపు సహా అదనపు షోలపై ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు టాలీవుడ్ పెద్దలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నా ముఖ్యమంత్రి- మంత్రుల నుంచి పెద్దగా స్పందన లేదు. ప్రభుత్వ కఠిన వైఖరితో అంతిమంగా నష్టపోయేది తామేనని ఎగ్జిబిటర్లు అభిప్రాయపడుతున్నారు. కొందరు హైకోర్టును ఆశ్రయించినా.. కోర్టు జాయింట్ కలెక్టర్ల విచక్షణకే వదిలేయడంతో పెద్దగా ఊరట లభించలేదు. అందుకే క్రైసిస్ నుంచి బయటపడేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించేలా థియేటర్ యాజమాన్యాలు చర్చలు సాగించనున్నాయి.
పరిస్థితులు చూస్తుంటే దీనిని స్నేహ పూర్వకంగా ప్రభుత్వంతో పరిష్కరించుకుంటారా లేక ధన్నాలు ఆందోళనలు అంటూ రచ్చ చేస్తారా? అన్నదానిపై సందేహాలున్నాయి. హైకోర్టులో తమ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకుని తమకు అనుకూలమైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఎగ్జిబిటర్లు అభ్యర్థిస్తారా? అన్నది తేలాల్సి ఉంది. ఈ కేసును గురువారం విచారించనుంది. హైకోర్టు ఆదేశాలను అనుసరించి తదుపరి ఏం చేయాలి? అన్నదానిపై నిర్నయం ఉంటుంది. ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకుంటే అది అందరికీ నష్టం. దీనికి సాధ్యమైనంత వేగంగా పరిష్కారం కావాలని ఎగ్జిబిటర్లు భావిస్తున్నారు. అందువల్ల వీరంత జగన్ ప్రభుత్వంతో ఏసీ-డీసీ తరహాలో వ్యవహరించే వీలుందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఘర్షణ పూరిత వాతావరణం కాకుండా స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవడమే ఉత్తమ మార్గమా? అన్నది జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఘర్షణతో సాధించేది శూన్యం అని ఇప్పటికే పరిశ్రమ ఆ నలుగురు కానీ నిర్మాతల గిల్డ్ కానీ అర్థం చేసుకున్నారు. సయోధ్యతోనే సమస్య పరిష్కరించుకునే దిశగా దిల్ రాజు వంటి వారు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసినదే.