Begin typing your search above and press return to search.
'రాధే శ్యామ్' పై రోజురోజుకూ పెరుగుతున్న అంచనాలు..!
By: Tupaki Desk | 18 Nov 2021 4:48 AM GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'రాధే శ్యామ్' సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఈ వింటేజ్ ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇన్నాళ్లూ పెద్దగా ప్రమోషన్స్ చేయకుండా సైలెంట్ గా ఉన్న మేకర్స్.. టీజర్ - ఫస్ట్ సింగిల్ తో ఒక్కసారిగా సినిమాపై భారీ హైప్ తీసుకొచ్చారు.
ప్రభాస్ పోషిస్తున్న విక్రమాదిత్య పాత్రను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన టీజర్ విజువల్ ట్రీట్ లా ఉంది. ఈ క్రమంలో వచ్చిన 'ఈ రాతలే' పాట సినిమా కథాంశం మీద ఆసక్తిని రెట్టింపు చేసిందనే చెప్పాలి.
'రాధే శ్యామ్' ఫస్ట్ సింగిల్ రెగ్యులర్ లిరికల్ వీడియో మాదిరిగా కాకుండా భిన్నంగా కాన్సెప్ట్ ని వివరిస్తూ సాగింది. ఇందులో ప్రధాన పాత్రల మోషన్ పిక్చర్స్ తో రూపొందించబడిన ఈ వీడియో విశేషంగా అలరిస్తోంది.
నాలుగు భాషల్లో విడుదలై ఈ సాంగ్ ఇప్పటికే 10 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టి ట్రెండింగ్ లో కొనసాగుతోంది. జస్టిస్ ప్రభాకర్ అందించిన ఫ్రెష్ ట్యూన్ కు యువన్ శంకర్ రాజా వాయిస్ తోడై ఈ పాట ఇంస్టెంట్ హిట్ గా నిలిచింది.
ముఖ్యంగా ఇందులో ప్రధాన జంటతో ఓ ఆసక్తికరమైన కథను వివరించడం అందరి దృష్టిని ఆకర్షించింది. క్రాష్ చేయబోతున్న రైలు నుండి హీరోయిన్ ను బయటకు తీసుకొచ్చి హీరో తన కారులో తీసుకెళ్లడం.. కారుతో సహా నీటిలో మునిగిపోవడం.. ఈ క్రమంలో ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని చివరకు ఒకరినొకరు కౌగిలించుకోవడం 'ఈ రాతలే' సాంగ్ లో చూడొచ్చు. ఈ విజువల్స్ కథకు సంబంధించి క్లూ ఇవ్వడమే కాకుండా సినిమాకు మరింత హైప్ ను తీసుకొచ్చింది.
అయితే ఇదే ఇప్పుడు అభిమానులను ఆందోళనకు గురిచేస్తోందని తెలుస్తోంది. 'సాహో' టైంలో కూడా ఇలానే ఉన్నట్టుండి టీజర్ - ట్రైలర్ - సాంగ్స్ రిలీజ్ చేసి సినిమాపై అంచాలను పెంచేశారు. కానీ చివరకు ఈ సినిమా బాలీవుడ్ మినహా మిగతా భాషల్లో ఆశించిన స్థాయిలో వసూళ్ళు రాబట్టలేకపోయింది. ఇప్పుడు 'రాధే శ్యామ్' మీద రోజురోజుకు పెరుగుతున్న అంచనాలు.. సినిమా సక్సెస్ కు ఏ విధంగా దోహదం చేస్తాయో చూడాలి.
ఇదిలా ఉండగా 'రాధే శ్యామ్' చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. నార్త్ ఇండియాలో దాదాపు 3500 స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ అవుతుందని ప్రచారం జరుగుతోంది. ఇదే కనుక నిజమైతే ఒక సౌత్ సినిమాకి నార్త్ లో బిగ్గెస్ట్ రిలీజ్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు 'రాధే శ్యామ్' సినిమా వాయిదా పడే అవకాశం ఉందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. 'ఆర్.ఆర్.ఆర్' 'భీమ్లా నాయక్' సినిమాలు సంక్రాంతి బరిలో ఉండటంతో.. వాలెంటైన్స్ వీక్ లో ఫిబ్రవరి 11న ప్రభాస్ సినిమాని రిలీజ్ చేస్తారని అంటున్నారు. మరి రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో చూడాలి.