Begin typing your search above and press return to search.
'కల్కి' మార్కెట్ సీనేంటో తెలుసా?
By: Tupaki Desk | 21 April 2019 9:29 AM GMTపోస్టర్.. టీజర్ తోనే క్రేజు తేవడంలో నవతరం దర్శకుల ట్యాలెంట్ కి సలాం కొట్టాల్సిందే. దర్శకులే రచయితలు కావడంతో ఎంతో జాగ్రత్తగా కొలతలు కొలిచి సినిమాకి ముందే బిజినెస్ వర్గాల్లో క్రేజు క్రియేట్ చేయడంలో సఫలమవుతున్నారు. మజిలీ, జెర్సీ పోస్టర్.. టీజర్ దశ నుంచే క్రేజు తెచ్చుకుని ట్రైలర్ తో పీక్స్ కి చేరుకున్నాయి. అందుకు తగ్గట్టే బిజినెస్ లోనూ హైప్ వచ్చింది. అయితే ఈ కోవలోనే మరో సినిమా గురించి పోస్టర్ .. టీజర్ దశనుంచే చక్కని టాక్ వినిపించింది. ఆ సినిమా ఏదో ప్రత్యేకించి చెప్పాల్సిన పనేలేదు. యాంగ్రీ హీరో డా.రాజశేఖర్ నటిస్తున్న కల్కి చిత్రానికి పోస్టర్ .. టీజర్ తోనే హైప్ పెంచడంలో టీమ్ సఫలమైంది. అ! లాంటి క్లాసిక్ సినిమాని పరిశ్రమకు అందించిన ట్యాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మరోసారి తనదైన శైలిలో మ్యాజిక్ చేయబోతున్నాడా? అంటూ ఆసక్తికర చర్చ సాగింది. ఇక పీఎస్.వీ గరుడవేగ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న రాజశేఖర్ మరోసారి ట్రాక్ లోకి వచ్చాడన్న మాటా ప్రముఖంగానే వినిపించింది.
అయితే ట్రేడ్ లో వాస్తవంగా జరుగుతున్న చర్చ ఏమిటి? అంటే అది పూర్తి విభిన్నంగా ఉందని చెబుతున్నారు. రాజశేఖర్ కల్కి టీజర్ చూశాక బిజినెస్ పరంగా హైప్ వచ్చినా.. చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ ఏరియా వైజ్ డీల్స్ విషయంలో పెద్ద మొత్తాల్ని కోట్ చేస్తూ.. ఏమాత్రం తగ్గడం లేదని తెలుస్తోంది. హైప్ పెంచి కాస్ట్ పెంచేయడంతో బయ్యర్లు, పంపిణీదారులు సినిమాని కొనేందుకు వెనకాడుతున్నారన్న చర్చా బయట జరుగుతోంది. రాజశేఖర్ మార్కెట్ పరిధి ఏమిటో కొనేవాళ్లకు స్పష్టంగా తెలుసు. ఆ మేరకు కోట్ చేసేందుకు మార్కెట్ వర్గాలు ప్రణాళికా బద్ధంగానే వెళుతున్నాయి. దీంతో ఇప్పటివరకూ కొన్ని ఏరియాల బిజినెస్ తెగలేదని తెలుస్తోంది. బ్లాక్ బస్టర్లు కొట్టిన దర్శకహీరోలు కలిసి పని చేసినంత మాత్రాన వాస్తవిక లెక్కల్ని దాటుకుని డిమాండ్ చేస్తే కష్టమేనన్న వాదనా ట్రేడ్ లో వినిపిస్తోంది. `భరత్ అనే నేను` బంపర్ హిట్ కొట్టినా కొన్ని ఏరియాల్లో బయ్యలర్లకు నష్టాలు తప్పలేదన్న మాటా వినిపించింది. ఆ క్రమంలోనే హైప్ క్రియేట్ చేసి అమ్మకాలు సాగించే సినిమాలపై బయ్యర్లు క్లీన్ రివ్యూలతో ముందుకు వెళుతున్నారని తెలుస్తోంది.
ఇకపోతే కల్కి సినిమా కథాంశాన్ని ఎంతో యూనిక్ స్టైల్ తో ఎంపిక చేసుకున్న ప్రశాంత్ వర్మ.. ఈసారి రాజశేఖర్ కాప్ లుక్ ని మోస్ట్ స్టైలిష్ గా ఎలివేట్ చేస్తున్నారని టీజర్ .. పోస్టర్లు క్లియర్ కట్ గా చెబుతున్నాయి. యాంగ్రీమ్యాన్ లోని `మగాడు`ని తిరిగి తెరపైకి తెస్తున్నాడా? అంటూ మాట్లాడుకోవడం ఆసక్తిని పెంచుతోంది. 1980 కాలంలో సాగే ఆసక్తికర చిత్రమిది. ఏప్రిల్ చివరికి అన్ని పనులు పూర్తి చేసి మేలో రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. అదాశర్మ, నందిత శ్వేత లాంటి గ్లామర్ క్వీన్స్ ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు. నాజర్, అశుతోష్ రాణా లాంటి టాప్ యాక్టర్లు ఈ చిత్రంలో నటించడం అదనపు అస్సెట్ అన్న టాక్ వినిపిస్తోంది.