Begin typing your search above and press return to search.
అఖిల్.. ఆ క్లబ్బులోకి వస్తేనే
By: Tupaki Desk | 9 Nov 2015 10:30 AM GMTఇంకొక్క రోజే మిగిలుంది అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా తెరంగేట్రానికి. మహేష్ బాబు ‘రాజకుమారుడు’ - రామ్ చరణ్ ‘చిరుత’ తర్వాత అత్యంత ఆసక్తి రేపుతున్న అరంగేట్రం అఖిల్ దే. తెలుగులో ఏ డెబ్యూ హీరో సినిమాకూ జరగనంత బిజినెస్ కూడా జరిగింది ‘అఖిల్’కి. దాదాపు రూ.45 కోట్లకు పైనే బిజినెస్ లెక్కలు చెబుతున్నారీ సినిమాకు. ఈ బిజినెస్... అఖిల్ కు ఉన్న ఫాలోయింగ్ అదీ చూసి.. ఇప్పటికే అతణ్ని కాబోయే సూపర్ స్టార్ అనేస్తున్నారు. ఐతే ఇలా ముందే ‘సూపర్ స్టార్’ అనిపించుకోవడానికి ఏముంది కానీ.. దాన్ని నిలబెట్టుకునేలా బాక్సాఫీస్ దగ్గర పెర్ఫామ్ చేయడం ముఖ్యం.
అక్కినేని ఫ్యామిలీలో అది పెద్ద మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న అఖిల్.. హీరోగా తన తొలి సినిమాతో ఎలాంటి వసూళ్లు సాధిస్తాడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వి.వి.వినాయక్ లాంటి మాస్ డైరెక్టర్ ఇమేజ్ కూడా తోడవుతోంది కాబట్టి.. ‘అఖిల్’ సినిమా తొలి రోజే రూ.10 కోట్ల షేర్ సాధించాల్సిందే అని టార్గెట్ పెట్టేశారు ట్రేడ్ పండిట్స్. నిజానికి సినిమా మీద ఉన్న హైప్, రిలీజ్ చేస్తున్న థియేటర్ల ప్రకారం చూస్తే పది కోట్ల మార్కు మరీ కష్టమేమీ కాకూడదు. పైగా పోటీ కూడా లేదు, పండగ సీజన్ కూడా. ఇక ఓవరాల్ కలెక్షన్లలో కూడా కూడా అఖిల్ మూవీ 50 కోట్ల క్లబ్బులోకి అడుగుపెడితే తప్ప హిట్టు అనిపించుకోదు. మరి ఏం జరుగుతుందో చూడాలి.