Begin typing your search above and press return to search.

సరైనోడిపై అంచనాలు పెరిగిపోతున్నాయ్

By:  Tupaki Desk   |   13 Feb 2016 12:46 PM IST
సరైనోడిపై అంచనాలు పెరిగిపోతున్నాయ్
X
అల్లు అర్జున్ సినిమాలు ఎప్పుడూ ఇంతే. ముందు సైలెంట్ గా షూటింగ్ అయిపోతాయ్. తర్వాత రిలీజ్ టైం దగ్గర పడేకొద్దీ అంచనాలు ఆకాశాన్ని అందుకంటే.. మూవీ టాక్ పాజిటివ్ గా ఉంటే.. రికార్డులు కొల్లగొట్టేస్తాయ్. ఇప్పుడు సరైనోడు కూడా ఇదే టైపులో సంచలనాలకు సిద్ధమవుతోంది. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బన్నీ హీరోగా సరైనోడు తెరకెక్కుతోంది. యాక్షన్ కం రొమాంటిక్ మూవీగా ఈ మూవీ ఉండదనుంది.

అసలు అప్ డేట్స్ ఏవీ బయటకు ఎక్కువగా లీక్ కాకుండా షూటింగ్ చేసేశారు ఈ సినిమాకి. ఇప్పుడు షూటింగ్ ఫినిషింగ్ దశకు వచ్చేస్తుండడంతో.. అంచనాలు పెరిగిపోతున్నాయి. ఫస్ట్ లుక్ ఇచ్చినప్పటి నుంచి బన్నీ మీద ఆశలు పెరిగిపోయాయి. మాంచి మాస్ లుక్ తో మెగా ఫ్యాన్స్ ఆకలి తీర్చేట్లుగా కనిపించాడు అల్లు అర్జున్. దీనికి తోడు గతేడాది సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత మెగా ఫ్యాన్స్ ని ఎంటర్ టెయిన్ చేసిన సరైన మూవీ లేదు. అందుకే ఇప్పుడు బన్నీ మీద ఆశలు పెరుగుతున్నాయి. త్వరలో విడుదల కానున్న టీజర్.. అన్ని అంశాలను మేళవించి రసవత్తరంగా తయారు చేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.

ఈ నెల 28 టీజర్ రిలీజ్ చేసేందుకు సరైనోడు యూనిట్ సిద్ధమవుతోందని సమాచారం. మార్చిలో ఆడియో విడుదల చేసి, ఏప్రిల్ 28న సరైనోడు మూవీని థియేటర్లలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించిన సరైనోడులో రకుల్ ప్రీత్ సింగ్ - కేథరిన్ థ్రెసా హీరోయిన్లు.