Begin typing your search above and press return to search.

కనీసం బాహుబలి 2 కూడా ఆడదంటారా?

By:  Tupaki Desk   |   25 April 2017 10:33 AM GMT
కనీసం బాహుబలి 2 కూడా ఆడదంటారా?
X
బాహుబలి ది బిగినింగ్.. మన దేశంలో బ్లాక్ బస్టర్. యూఎస్ లో కూడా ఇరగదీసింది. దీన్ని బేస్ చేసుకుని.. ఈ సినిమాను మార్కెట్ చేసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా గట్టిగానే ప్రయత్నించారు. వరల్డ్ వైడ్ గా అన్ని భాషల్లో బాహుబలి2ని ఒకేసారి రిలీజ్ చేస్తామని హంగామా చేశారు. అయితే.. ఇప్పుడా హడావిడి కనిపించడం లేదు. దేశీయ భాషల్లో తప్ప మరో మాట ఎత్తడం లేదు.

అందుకు కారణం లేకపోలేదు. బాహుబలి ది బిగినింగ్ మూవీని చైనాలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తే.. మొదటి షో నుంచే సూపర్ ఫ్లాప్ టాక్ వచ్చింది. ఇక జర్మన్ వెర్షన్ అయితే.. డిజాస్టర్ అయిపోయింది. ఇండియన్ వెర్షన్స్ కి తప్ప మరో చోట ఎక్కడా ఆడిన దాఖలాలు ఇందుకు కారణాలు లేకపోలేదు. ఫ్రాన్సులో అతి పెద్ద ధియేటర్లో సినిమా పడింది అంటూ అభిమానులు కాలర్లు ఎగరేయడమే కాని.. నిజానికి సినిమాలో మ్యాటర్ లేదని అక్కడివారు కామెంట్లు చేశారు. బాహుబలి-1 సెకండాఫ్ లో కేవలం యుద్ధం తప్ప మరేమీ ఉండదు. అది కూడా ఎమోషన్స్ పాళ్లు ఏ మాత్రం లేకుండా.. కేవలం రాజమౌళి స్టైల్ యుద్ధాన్ని చూసేందుకే సినిమాకి వెళ్లాలి. పైగా కొత్తగా క్రియేట్ చేసిన ఫైటింగ్ సీన్స్ ఏమీ లేవు. అన్నీ కూడా ఏదో ఒక హాలివుడ్ సినిమా నుండి తీసుకున్నవే. అందుకే ప్రపంచంలో ఎవరికీ ఈ సినిమా పెద్దగా ఎక్కలేదు.

ఇకపోతే బాహుబలి 2 మొత్తంగా 1000 కోట్లు రాబట్టే సినిమా ప్రచారం అయితే జరుగుతోంది కానీ.. ఇంత మొత్తాన్ని కేవలం ఇండియన్ వెర్షన్స్ తో రాబట్టడం అంత ఈజీ ఏం కాదని చెప్పాలి. మేకర్స్ కే ఇంటర్నేషనల్ వెర్షన్ పై కాన్ఫిడెన్స్ లేదనే అనిపిస్తోంది. బాహుబలి2 కూడా ఫెయిల్ అవుతుందనే అనుమానంతోనే.. ఇప్పుడు దాని గురించి నోరెత్తడం లేదు జక్కన్న అండ్ టీం అని టాక్. కనీసం బాహుబలి 2 అయినా ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆడితే బాగుండు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/