Begin typing your search above and press return to search.
300 కోట్లు మార్కు దాటుతుందా?
By: Tupaki Desk | 10 July 2015 10:44 AM GMTతెలుగేతర ప్రాంతాల్లోనూ బాహుబలి దుమ్ము దులుపుతోంది. ముఖ్యంగా హిందీ వెర్షన్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చినట్లు చెబుతున్నారు. ముంబయి, ఇతర మెట్రో నగరాల్లో మంచి కలెక్షన్లు సాధిస్తున్నట్లు చెబుతున్నారు. వచ్చేవారం సల్మాన్ సినిమా భజరంగీ భాయ్‌జాన్ వస్తుండడంతో ఈ వారం ఉత్తరాదిలో థియేటర్లన్నీ బాహుబలికి కేటాయించారు. ఈ వారంలో పెద్దగా హిందీ సినిమాలేవీ లేకపోవడంతో ఈ వారం రోజుల పాటు బాహుబలి కలెక్షన్లకు డోకా ఉండదని తేలిపోయింది. ఈ సినిమా వ్యవహారాల్లో కరణ్ జోహార్ కూడా ఉండడంతో థియేటర్లు కూడా పెద్ద సంఖ్యలోనే దొరికాయి. పైగా తెలుగులో కంటే హిందీ, ఇంగ్లీష్ లోనే ఈ సినిమాకు మంచి రివ్యూలు వచ్చాయి.. ఇవన్నీ ఓపెనింగ్ కలెక్షన్లను పెంచుతున్నాయి. హిందీ వెర్షన్ ఈ రేంజిలో సక్సెస్ కావడంతో అనుకున్న కంటే అధికంగా ఆదాయం సాధిస్తుందని... రికార్డులు నెలకొల్పుతుందని భావిస్తున్నారు.
ఈ ఏడాదిలో ఇంతవరకు వచ్చిన సినిమాల్లో ఏబీసీడీ2 అత్యధిక కలెక్షన్లు సాధించింది. ఆ సినిమాకు తొలిరోజున రూ.14.30 కోట్లు వచ్చాయి. ఆ సినిమా 2500 థియేటర్లలో రిలీజ్ కాగా బాహుబలి ఏకంగా 4 వేల థియేటర్లలో రిలీజయింది. దీని ప్రకారం మొదటి రోజు కలెక్షన్లు రూ.20 కోట్లు దాటుతాయని అంచనా వేస్తున్నారు. ఓవర్సీస్ కూడా లెక్కేస్తే మొత్తం రూ.25 కోట్లకు మించినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఒక్క హైదరాబాద్‌లోనే మూడు కోట్లు వస్తుందంటున్నారు.
ఇక మొత్తం కలెక్షన్ల విషయానికొస్తే హిందీలో వారం వరకు దీనికి పోటీ లేదు. ఆ తరువాత భజరంగీ భాయ్‌జాన్ వచ్చినా ఇది కొంతవరకు తట్టుకోగలుగుతుందని చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నెల రోజుల వరకు సరైన సినిమాయే లేదు. పైగా పుష్కరాలు ఉండడంతో సినిమాలకు వెళ్లే ప్రజలూ పెరుగుతారు. ఇవన్నీ కలిసొస్తే బాహుబలి కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని తెలుస్తోంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం నాలుగు వెర్షన్లు కలిపి రూ.300 కోట్లు రాబడతాయని అంచనావేస్తున్నారు.