Begin typing your search above and press return to search.
చిరు చెప్పక్కర్లే.. 150లో అన్నీ ఉంటాయ్
By: Tupaki Desk | 14 Jun 2016 5:25 AM GMTమెగాస్టార్ చిరంజీవి కత్తి రీమేక్ చేస్తానని చెప్పినప్పటి నుంచి ఏదో ఒక వివాదం తెర మీదకు వస్తూనే ఉంది. స్టోరీ వివాదం ఒరిజినల్ నిర్మాతలకు తప్ప.. చిరుకి సంబంధం లేదనే వాస్తవం తెలిసినా.. మెగాస్టార్ ఏదో అన్యాయం చేశాడని అనిపించేలా ప్రచారం జరిగింది. సరే జరిగింది ఏదైనా.. చివరకు చిరు ఎంట్రీ ఇచ్చాకే.. ఆ రైటర్ కు న్యాయం జరిగేలా చూశారు. ఆ కథ ముగిసిపోవడంతో.. ఇప్పుడింకో కొత్త వాదన వస్తోంది.
సిని'మా' అవార్డ్ ఫంక్షన్ లో చిరు మాట్లాడుతూ తన 150వ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ - సోషల్ మెసేజ్ - రొమాన్స్ - ఎంటర్ టెయిన్ మెంట్.. ఇలా అన్నీ ఉన్న సినిమా చేస్తున్నట్లు చెప్పారు. దీన్ని పట్టుకుని.. తమిళ్ 'కత్తి'లో ఉన్న ఫ్లేవర్ ని చిరు కోసం పాడు చేస్తున్నారంటూ ఓ ప్రచారం చేసేశారు. సమాజానికి మెసేజ్ ఇచ్చేలా మురుగదాస్ రాసిన కథను.. మెగా ఇమేజ్ కోసం నాశనం చేసేస్తున్నారని తెగ బాధపడిపోయే బ్యాచ్ 150వ సినిమాపై పంచ్ల మీద పంచ్ లు వేస్తున్నారు. బట్ వాస్తవం ఏంటంటే.. కోలీవుడ్ కత్తిలో.. సమంతతో విజయ్ రొమాన్స్ టాప్ రేంజ్ లో ఉంటుంది. అంతే కాదు.. 'సెల్ఫీ పుల్ల' అంటూ సాగే సెక్సీ సాంగ్ అయితే.. ఆ ఏడాది టాప్ చార్ట్ బస్టర్. ఇక హీరోయిన్ ను టీజ్ చేయడం - ఓ మాంచి లవ్ ట్రాక్ - సూపర్బ్ కామెడీ.. వీటన్నిటికీ తోడు భారీ భారీ ఫైట్లు - అదిరిపోయే ఇంటర్వెల్ బ్యాంగ్.. అన్నీ ఉన్న ఫుల్ మీల్స్ కాబట్టే అక్కడ అంత పెద్ద హిట్ గా నిలిచింది. ఓ 20నిమిషాల ఫ్లాష్ బ్యాక్ - క్లైమాక్స్ లో మాత్రమే సోషల్ మెసేజ్ ఉంటుంది.
అంటే మనోళ్ళు తమిళ్ సినిమా చూడకుండానే ఇలా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా పాడు చేస్తున్నారు అంటూ కథలు చెప్పేస్తున్నారనమాట. ఒరిజినల్ సినిమా చూసి కామెంట్లు చేయండి బాస్ అంటూ మెగా ఫ్యాన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు. అసలు మురుగదాస్ మెసేజ్ ఓరియెంటెడ్ గానే సినిమా తీయడం ఏంటండీ.. ఇదో పెద్ద జోక్ అనే చెప్పాలి. ఎందుకంటే.. ఒకే ఒక్క మెసేజ్ ను పట్టుకుని.. దాని చుట్టూ 99 కమర్షియల్ ఎలిమెంట్స్ ని మిక్స్ చేసి.. అన్నీ ఆ మెసేజ్ చుట్టూ తిప్పడమే మురుగదాస్ స్టయిల్. సో.. కత్తి లో ఆల్ ఎలిమెంట్స్ ఉంటాయని చిరంజీవి చెప్పినా చెప్పకపోయినా.. అందులో ఉంటాయ్ అంతే.