Begin typing your search above and press return to search.

బాల‌య్య‌కు 100కోట్ల మార్క్ సాధ్య‌మేనా?

By:  Tupaki Desk   |   5 Dec 2015 4:45 AM GMT
బాల‌య్య‌కు 100కోట్ల మార్క్ సాధ్య‌మేనా?
X
ఇటీవ‌లి కాలంలో తెలుగు సినిమా ప‌రిధి విస్త‌రించింది. లోక‌ల్ మార్కెట్‌ ను దాటి, పొరుగు భాష‌ల్లోనూ హ‌వా సాగిస్తోంది. త‌మిళ్‌ - క‌న్న‌డం - మ‌ల‌యాళ భాష‌ల్లోనూ వ‌సూళ్లు తెచ్చే స‌త్తాని పెంచుకుంటూ యువ‌హీరోలంతా స్పీడ్ చూపిస్తున్నారు. మ‌హేష్‌ - ప్ర‌భాస్‌ - బ‌న్ని - చ‌ర‌ణ్ ఇప్ప‌టికే పొరుగు భాష‌ల్లో బాక్సాఫీస్ రాజాలుగా నిరూపించుకున్నారు. అందుకే ఈ హీరోలు న‌టించిన సినిమాలు మినిమం 50 కోట్లు పైగానే వ‌సూలు చేస్తున్నాయి.

గ్రాస్‌ కలెక్షన్స్‌ లో.. బాహుబ‌లి 500 కోట్ల క్ల‌బ్ సినిమాగా నిలిచి సంచ‌ల‌నం సృష్టించింది. ఆ వెంట‌నే రిలీజైన శ్రీ‌మంతుడు 150 కోట్లు వ‌సూలు చేసి ఔరా అనిపించింది. ప‌వ‌న్‌ క‌ల్యాణ్ న‌టించిన అత్తారింటికి దారేది 100 కోట్ల క్ల‌బ్ సినిమాగా పేరు తెచ్చుకుంది. ఈ లెక్క‌న చూస్తే స్టార్‌ డ‌మ్‌ - ఛ‌రిష్మా - అభిమాన బ‌లం ఉన్న హీరోలు 100 కోట్ల వ‌సూళ్లు తేవ‌డం క‌ష్టం కాద‌ని ప్రూవైంది. స‌రైన క‌థ‌ని ఎంచుకుని, పెర్ఫామెన్స్ జోడిస్తే ఆ వ‌సూళ్లు తెలుగులోనూ సాధ్య‌మేన‌ని ప్రూవైంది. అందుకే ఇప్పుడు ఈ లీగ్‌ లోకి న‌ట‌సింహా బాల‌య్య చేరుతారా? లేదా? అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

బాల‌య్య‌బాబు ప్ర‌స్తుతం డిక్టేట‌ర్ మూవీలో న‌టిస్తున్నారు. ఇది ఆయ‌న కెరీర్‌లో 99వ సినిమా. లెజెండ్ మూవీతో భారీ వ‌సూళ్లు సాధించిన బాల‌య్య పెరిగిన మార్కెట్ రేంజును బ‌ట్టి ఈసారి 100 కోట్ల క్ల‌బ్‌ లో ప్ర‌వేశించే ఛాన్సుంద‌ని విశ్లేష‌ణ‌లు వెలువ‌డుతున్నాయి. వాస్త‌వానికి మ‌న సీనియ‌ర్ హీరోలెవ‌రూ పొరుగు భాష‌ల్లో మార్కెట్ కోసం ప్ర‌య‌త్నించిందే లేదు. ఇమేజ్ చ‌ట్రంలో అభిమానుల కోస‌మే క‌థ‌లు రాయించుకుని న‌టించ‌డం వ‌ల్ల ఇత‌ర మార్కెట్ ల‌లోకి చొచ్చుకెళ్ల‌లేక‌పోయారు. ఈ సారి శ్రీ‌వాస్ ఆ బ్యారియ‌ర్‌ ని తొల‌గించి ఇత‌ర మార్కెట్ ల‌లోనూ డిక్టేట‌ర్ రేంజుని చూపిస్తాడేమో చూడాలి.