Begin typing your search above and press return to search.
కాటమరాయుడు కుమ్మేయడం ఖాయం
By: Tupaki Desk | 15 March 2017 8:55 AM GMTమామూలుగా ఒక హీరో సినిమా పెద్ద ఫ్లాప్ అయిందంటే.. ఆ తర్వాతి సినిమా మీద కచ్చితంగా ఆ ప్రభావం ఉంటుంది. ఐతే లాస్ట్ మూవీ ఎంత పెద్ద డిజాస్టర్ అయినా తర్వాతి సినిమా మీద ఆ ఎఫెక్ట్ అస్సలు పడలేదంటే అలాంటి హీరోల్నే సూపర్ స్టార్లు అంటారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ కోవలోకే వస్తాడు. ఒక టైంలోపదేళ్ల పాటు పవన్ కు స్థాయికి తగ్గ విజయం లేకపోయినా సరే.. తన ప్రతి సినిమాకూ మాంచి హైప్ వచ్చింది. ‘పంజా’ లాంటి డిజాస్టర్ తర్వాత కూడా ‘గబ్బర్ సింగ్’కు విపరీతమైన హైప్ వచ్చింది. ఇక ఆ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఎలా వసూళ్ల మోత మోగించిందో తెలిసిందే.
ఇప్పుడు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లాంటి డిజాస్టర్ తర్వాత రాబోతున్న పవన్ సినిమా ‘కాటమరాయుడు’కు కూడా హైప్ తక్కువేమీ లేదు. టీజర్ రిలీజవ్వగానే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోగా.. పబ్లిసిటీ కూడా కొంచెం గట్టిగా చేస్తూ హైప్ మరింత పెరిగింది. దీనికి తోడు పరీక్షల సీజన్ కావడంతో కొన్ని వారాలుగా ఓ మోస్తరు సినిమాలేవీ రాలేదు. థియేటర్లు వెలవెలబోతున్నాయి. దీంతో ‘కాటమరాయుడు’ కోసమే థియేటర్లు కూడా కాచుకుని కూర్చుకున్నాయి. సినీ ప్రియులు కూడా స్టార్ హీరో సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక పరీక్షలు ముగించుకుని ఫ్రీ అయ్యే విద్యార్థులూ థియేటర్లలో దూకేయడానికి రెడీ అయిపోతారు. మొత్తంగా ‘కాటమరాయుడు’ థియేటర్లలోకి దిగే సమయానికి హంగామా మామూలుగా ఉండదు. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లోని కనీసం 80 శాతం థియేటర్లలో నింపేస్తారని అంచనా. కాబట్టి నాన్-బాహుబలి డే-1 రికార్డుల్ని భారీ తేడాతో కొట్టేయడం ఖాయం. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమానే తొలి రోజు రూ.30 కోట్ల షేర్ రాబట్టి సంచలనం రేపింది. ‘కాటమరాయుడు’ రూ.40 కోట్ల మార్కును అందుకున్నా ఆశ్చర్యం లేదని ట్రేడ్ పండిట్ల అంచనా. చూద్దాం ఏమవుతుందో?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/