Begin typing your search above and press return to search.
సర్దార్ రికార్డు కొట్టడం కష్టమేమో
By: Tupaki Desk | 16 May 2016 5:30 PM GMTటాలీవుడ్లో ప్రస్తుతం రికార్డుల మాటెత్తితే ముందు పవన్ కళ్యాణ్.. మహేష్ బాబు పేర్లే గుర్తుకొస్తాయి. ‘బాహుబలి’ని పక్కనబెట్టేస్తే గత కొన్నేళ్లుగా ఆల్ టైం రికార్డుల్ని వీళ్లిద్దరే ఒకరి తర్వాత ఒకరు బద్దలు కొడుతున్నారు. ఈ ఏడాది నెల వ్యవధిలో వీళ్లిద్దరూ బాక్సాఫీస్ సమరానికి దిగుతుండటంతో రికార్డుల మీద అందరి దృష్టీ నిలిచింది. గత ఏడాది ‘శ్రీమంతుడు’తో నాన్ బాహుబలి రికార్డులన్నీ తన ఖాతాలో వేసుకున్నాడు మహేష్. ఈ రికార్డుల్ని పవన్ తన ‘సర్దార్ గబ్బర్ సింగ్’తో కొట్టేస్తాడని అభిమానులు ఆశించారు. వాళ్ల అంచనాలకు తగ్గట్లే తొలి రోజు రికార్డుల తుప్పు వదలగొట్టింది ‘సర్దార్’. రూ.30 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్లతో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఐతే తొలి రోజు జోరు చూసి పవన్ ఫ్యాన్స్ ఎంతో ఊహించుకున్నారు. కానీ ఈ సినిమాది ఆరంభ శూరత్వమే అయింది. తొలి రోజు రికార్డు తప్ప ఇంకేమీ మిగల్లేదు ‘సర్దార్’కు.
ఇప్పుడిక మహేష్ బాబు రంగంలోకి దిగుతున్నాడు. ‘బ్రహ్మోత్సవం’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సినిమా మీద పూర్తి పాజిటివ్ బజ్ ఉంది ఇండస్ట్రీలో.. జనాల్లో. భారీ అంచనాల మధ్య సినిమా రిలీజవుతోంది. స్యూర్ షాట్ హిట్ లా కనిపిస్తున్న ‘బ్రహ్మోత్సవం’ ఖాతాలో నాన్-బాహుబలి రికార్డులు చేరడానికి బాగానే అవకాశాలున్నాయి.
ఐతే తొలి రోజు కలెక్షన్ల రికార్డు మాత్రం మహేష్ సొంతం కాకపోవచ్చేమో. ఎందుకంటే ‘బ్రహ్మోత్సవం’ మీద ఎంత పాజిటివ్ బజ్ ఉన్నప్పటికీ ఎంతైనా ఇది క్లాస్ సినిమా. ఫైట్లు గట్రా పెద్దగా ఉండేలా లేవు. మాస్ పాటలు.. డ్యాన్సులకు కూడా అవకాశం లేదు. కాబట్టి మాస్ సినిమాలకున్నంత హైప్ దీనికి ఉండదు. ‘సర్దార్’ మాస్ సినిమా కాబట్టి జనాలు విపరీతంగా ఎగబడ్డారు. షోలు మోతెక్కిపోయాయి. బుకింగ్స్ అదిరిపోయాయి. ‘బ్రహ్మోత్సవం’ విషయంలో ఆ ఊపు ఉండకపోవచ్చు. కాబట్టి తొలి రోజు వసూళ్ల విషయంలో ఆశలు పెట్టుకోకుంటే మంచిది. ఐతే సినిమాకు అనుకున్నట్లే పాజిటివ్ టాకే వస్తే ఫుల్ రన్ కలెక్షన్ల రికార్డులు మాత్రం బద్దలయ్యే అవకాశాలు మాత్రం మెండుగా ఉన్నాయి.