Begin typing your search above and press return to search.
నిన్నే నమ్ముకున్నాం నాగ్...
By: Tupaki Desk | 25 March 2016 4:43 AM GMT‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాతో 2016లో తెలుగు సినిమాకు అద్భుతమైన ఆరంభాన్నిచ్చాడు అక్కినేని నాగార్జున. దానికి ముందు.. తర్వాత కూడా హిట్టు సినిమాలున్నాయి కానీ.. ఈ ఏడాదికి ఇప్పటిదాకా అదే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఈ సినిమా అందరికీ అన్ని రకాలుగా సంతోషాన్నిచ్చింది. ఐతే సంక్రాంతి సీజన్ తర్వాత చాలా సినిమాలు వచ్చాయి.. అందులో మంచి సినిమాలూ ఉన్నాయి కానీ.. ఏవి కూడా బాక్సాఫీస్ ను కళకళలాడించలేకపోయాయి. ముఖ్యంగా క్రౌడ్ పుల్లర్స్ లేక థియేటర్లు చాలా వరకు కళతప్పాయి. పరీక్షల సీజన్ కావడంతో ఫిబ్రవరి - మార్చి నెలల్లో సినిమాల పరిస్థితి దయనీయంగా మారింది. అందులోనూ రెండు మూడు వారాలుగా పరిస్థితి మరీ ఘోరంగా ఉంది.
ఇలాంటి సమయంలో మళ్లీ నాగార్జునే థియేటర్లను కళకళలాడిస్తాడని ఆశతో ఉన్నారందరూ. మొన్నే ‘రన్’ సినిమా సమ్మర్ సందడికి తెర తీసినప్పటికీ.. అసలు ఆరంభం ‘ఊపిరి’తోనే ఉంటుందని ఆశిస్తున్నారు. ప్రస్తుతం నాగ్ ఉన్న ఊపుకు తోడు.. సినిమా మీద కూడా పాజిటివ్ బజ్ ఉండటంతో ‘ఊపిరి’కి అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే జరిగాయి. సినిమాకు అనుకున్నట్లే పాజిటివ్ టాక్ వస్తే.. థియేటర్లు మళ్లీ నిండుగా కళకళలాడటం ఖాయం. ఇప్పుడే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ పరీక్షల హాళ్ల నుంచి సినిమాల వైపు మళ్లబోతున్నారు. సరిగ్గా ఆ టైంలోనే థియేటర్లలో దిగుతోంది ‘ఊపిరి’. టాక్ బాగా రావాలే కానీ.. ఏప్రిల్ 8న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ వచ్చే వరకు బాక్సాఫీస్ ను దున్నేసుకోవచ్చు నాగ్ మూవీ. మరి ఈ సినిమా జనాల్ని ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.