Begin typing your search above and press return to search.
జనతా గ్యారేజ్.. మరీ ఈ స్థాయిలోనా?
By: Tupaki Desk | 9 March 2016 11:30 AM GMTరెగ్యులర్ షూటింగ్ మొదలైందే కొన్ని రోజుల కిందట. విడుదలకు ఇంకా ఆరు నెలలకు పైగా సమయముంది. కానీ అప్పుడే ‘జనతా గ్యారేజ్’ విషయంలో ట్రేడ్ వర్గాల్లో విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. ఈ సినిమాకు అలాంటి కాంబినేషన్ కుదిరింది మరి. మిర్చి - శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్లు కొట్టిన కొరటాల శివ దర్శకుడు కావడం... హీరో ఎన్టీఆర్ టెంపర్ - నాన్నకు ప్రేమతో లాంటి సక్సెస్ ల తర్వాత నటిస్తున్న సినిమా కావడం.. ‘శ్రీమంతుడు’తో టాలీవుడ్ లోకి అదిరిపోయే అరంగేట్రం చేసిన నిర్మాతలు ప్రొడ్యూస్ చేస్తుండటంతో ‘జనతా గ్యారేజ్’ సెట్స్ మీదికి వెళ్లకముందే బిజినెస్ పూర్తి చేసుకుని సంచలనం సృష్టించింది. పైగా ఈ సినిమాకు రికార్డు స్థాయిలో రూ.60 కోట్ల దాకా బిజినెస్ జరిగినట్లు కూడా చెబుతున్నారు.
ఇక ఈ సినిమాను ఇండియా - అమెరికా - కెనడా కాకుండా మిగతా అన్ని దేశాల్లో రిలీజ్ చేయబోతున్న ‘ఆస్ తెలుగు’ సంస్థ.. ట్రేడ్ ఎంక్వైరీల కోసం ఆల్రెడీ ప్రకటన కూడా ఇచ్చేసింది. మామూలుగా ఇలాంటి ప్రకటనలు రిలీజ్ కు నెల రోజుల ముందు మాత్రమే వస్తాయి. కానీ మొన్నే రెగ్యులర్ షూటింగ్ ఆరంభమై.. ఎప్పుడో ఆర్నెల్ల తర్వాత సినిమా విడుదల కాబోతుంటే.. ఇలా ట్రేడ్ ఎంక్వైరీలకు ప్రకటన ఇచ్చారంటే సినిమా మీద ఏ స్థాయిలో హైప్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎన్టీఆర్, కొరటాలల చివరి సినిమాలు విదేశాల్లో మంచి వసూళ్లు సాధించిన నేపథ్యంలోనే ఈ హైప్ అని అర్థం చేసుకోవచ్చు. ఆగస్టు 12న ‘జనతా గ్యారేజ్’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.