Begin typing your search above and press return to search.
కబాలి పీడకల గుర్తు తెస్తున్న కాలా
By: Tupaki Desk | 1 May 2018 1:30 AM GMTఏ ఏడాదిన్నర క్రితం కబాలి అంటూ రజినీకాంత్ మూవీ చాలా గ్రాండ్ గా రిలీజ్ అయింది. చివరకు సినిమా రిలీజ్ సందర్భంగా స్పెషల్ ఫ్లైట్స్ వేయడమే కాదు.. పలు సాఫ్ట్ వేర్ ఆఫీసులకు కూడా సెలవలు ఇచ్చేశారు. అంతగా హంగామా చేసిన చిత్రం.. చివరకు ఆడియన్స్ అందరినీ డిజప్పాయింట్ చేసింది. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ కి బయ్యర్స్ కి అయితే పీడకలగా మిగిలిపోయింది.
ఇప్పుడు అదే దర్శకుడు పా రంజిత్ దర్శకత్వంలో కాలా కరికులన్ విడుదల అవుతోంది. ఈ పాటికే థియేటర్లలో ఉండాల్సిన ఈ సినిమా.. పరిస్థితుల కారణంగా జూన్ 7కు వాయిదా పడింది. ఇంకా సినిమా విడుదలకు నెలకు పైగా ఉన్న సమయంలో రజినీకాంత్ అమెరికాలో వాలిపోయారు. సమ్మర్.. ట్రీట్మెంట్ గట్రా అంటూ యూఎస్ లో చక్కర్లు కొడుతున్నారు సూపర్ స్టార్. ఇక్కడే అసలు విషయం తేడా కొడుతోంది. సరిగ్గా కబాలి రిలీజ్ కి ముందు ఇలాగే అమెరికా వెళ్లిపోయారు రజినీకాంత్. సినిమాకు కనీస మాత్రం ప్రచారం కూడా చేయలేదు.
తీరా సినిమా థియేటర్లలోకి వచ్చి.. ఆ ఫ్లాప్ హంగామా అంతా జనాలు మర్చిపోయిన కొన్నాళ్లకు చెన్నై చేరారు రజినీ. అప్పుడు కూడా ఇలాగే హెల్త్ చెకప్ అనే చెప్పుకొచ్చారు. అందరూ కబాలిని బాషా టైపు సినిమా అనుకుంటే.. తీరా ఇంకోటేదో చూడాల్సి రావడంతో డిజప్పాయింట్ కావాల్సి వచ్చింది. కానీ మూవీ కంటెంట్ విషయంలో ఎవరూ అడిగే ఛాన్స్ లేకుండా అప్పుడు సూపర్ స్టార్ అమెరికాలో ఉన్నారు. ఆయన తిరిగొచ్చే సరికి సినిమా గురించి జనాలు మర్చిపోయారు కూడా.
ఇప్పుడు మళ్లీ అదే పా రంజిత్.. మళ్లీ అదే మాఫియా బ్యాక్ గ్రౌండ్ లో తీసిన సినిమా కాలా. ఇప్పుడాయన మళ్లీ విడుదలకు ముందు అమెరికా వెళ్లిపోయారు. ఎప్పుడొస్తారు అనే విషయంలో ఎవరికీ క్లారిటీ లేదు. రోబో 2.ఓ కోసం కూడా ఆయన చేయాల్సిన వర్క్ ఏమీ లేదు. మరి మళ్లీ కాలాతో కబాలి రోజులను గుర్తు తెస్తారో.. ఈ సారైనా రజినీ అండ్ రంజిత్ లు కలిసి జనాలను మెప్పిస్తారో చూడాలి.