Begin typing your search above and press return to search.
'బాహుబలి 2' రికార్డును కొట్టలేరు
By: Tupaki Desk | 19 Nov 2018 4:29 AM GMTశంకర్ `2.ఓ` రాజమౌళి `బాహుబలి 2` రికార్డుల్ని కొట్టేస్తుందా? ఇండియా వైడ్ - వరల్డ్ వైడ్ రికార్డుల్ని బ్రేక్ చేస్తుందా? ఆ సినిమాకి అంత సీనుందా? అంటే అభిమానుల్లో రకరకాలుగా చర్చ సాగుతోంది. వాస్తవానికి 2.ఓ ట్రైలర్ చూశాక మిశ్రమ స్పందనలు వినిపించాయి. ఈ ట్రైలర్ కొందరికి నచ్చితే, చాలా మంది ఇలా ఉందేంటి? అన్నారు. అయితే ఆ ట్రైలర్ ని 3డిలో చూసిన వాళ్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంటూ కితాబిచ్చేస్తున్నారు. 2.ఓ పూర్తిగా సాంకేతికతను ఇన్ బిల్ట్ చేసి రూపొందించిన చిత్రం. 2డి విజువల్స్ కి 3డి విజువల్స్ కి ఉండే మహదాద్భుతమైన వేరియేషన్ ను తెరపై చూసినప్పుడే అర్థమవుతుంది. అందుకే 2.ఓ ట్రైలర్ ని బుల్లితెరపై లేదా మొబైల్ లో చూసినప్పుడు అంత ఫీల్ కలగలేదు. ఇంకా చెప్పాలంటే `బాహుబలి 2` ట్రైలర్ చూసినప్పుడు కలిగిన ఫీల్ 2.ఓ ట్రైలర్ ని చూస్తే కలగలేదు.
అసలు విషయానికి వస్తే, 2.ఓ రికార్డుల మాటేమిటి? ఈ సినిమా ఇప్పటివరకూ ఉన్న అన్ని రికార్డుల్ని బ్రేక్ చేస్తుందా? ముఖ్యంగా అన్ బీటబుల్ గా ఉన్న `బాహుబలి 2` ఓపెనింగ్ డే రికార్డుని చెరిపేస్తుందా? అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది. 2.ఓ మరో 10రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నవంబర్ 29న రిలీజ్ కాబట్టి - ట్రేడ్ లోనూ ఆసక్తికర విశ్లేషణలు జోరందుకున్నాయి. 2.0 ప్రకంపనాలు సాధ్యమే. అయితే డే 1 ఇండియా ఓపెనింగుల రికార్డులు బద్ధలు కొట్టడం ఖాయమేనా అన్నది చెప్పలేం. బాహుబలి 2 చిత్రం మొదటి రోజు కేవలం ఇండియాలో దాదాపు 122కోట్ల నెట్ వసూలు చేసింది. అంటే గ్రాస్ 150కోట్లు పైమాటే.
ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేయాలన్న పంతం 2.ఓ టీమ్‌కి ఉన్నా - అది సాధ్యమా? అన్న మాటా వినిపిస్తోంది. ఇప్పటికే ప్రఖ్యాత తమిళ క్రిటిక్ రమేష్ బాలా అందించిన వివరాల ప్రకారం.. ఈ సినిమా మొదటి రోజు 100కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారట. అంటే బాహుబలి రికార్డును టచ్ చేయనట్టే. ఇక పదిరోజులు ఉండగానే ఈ సినిమా ముందస్తు బుకింగ్ ల రూపంలో హిందీ వెర్షన్ 35కోట్ల నెట్ లెక్క తేలిందని బాలా చెబుతున్నారు. 35కోట్ల నెట్ అంటే గ్రాస్ ఇంకా ఎక్కువే. మరి 2.ఓ ప్రభంజనం ఎలా ఉంటుంది? అన్నది రిలీజ్ వరకూ వేచి చూడాల్సిందే.