Begin typing your search above and press return to search.
గీత గోవిందంకు భలే పబ్లిసిటీ!
By: Tupaki Desk | 29 July 2018 10:00 AM GMTటైం కలిసివచ్చినప్పుడు అదృష్టం అదంతకదే కలిసి వస్తుంది. సుడి తిరిగినప్పుడు సినిమాకు పబ్లిసిటీ కూడా అలాగే జత కూడుతుంది. గీత గోవిందం విషయంలో ఇది అక్షరాలా ఋజువవుతోంది. గోపి సుందర్ స్వరపరిచిన మొదటి ఆడియో సింగల్ ఇంకేం ఇంకేం కావాలే ఇప్పటికే పాతిక మిలియన్ల దగ్గరకు చేరుకొని ఔరా అనిపించగా 24 గంటల లోపే వాట్ ది ఫా అంటూ విజయ్ దేవరకొండ స్వంతంగా పాడిన రెండో పాట చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. లిరిక్స్ వివాదాస్పదంగా ఉండటంతో విజయ్ గొంతు గురించి సోషల్ మీడియాలో ఓ రేంజ్ ట్రాలింగ్ జరగడం మైనస్ గా కాకుండా ప్లస్ గా నిలిచింది. తాత్కాలికంగా ఆ పాటను యు ట్యూబ్ ను నుండి తీసేసేదాకా వచ్చింది పరిస్థితి. ఇక ఈ రోజు ఆడియో వేడుక చేస్తున్నారు. అల్లు కాంపౌండ్ సినిమా కాబట్టి అతిధిగా అల్లు అర్జున్ రావడంలో విశేషం లేదు కానీ తను ఏం మాట్లాడబోతాడా అనే దాని గురించి సర్వత్రా ఆసక్తి నెలకొంది.
సినిమా గురించి ఎలా మాట్లాడినా దాన్ని అవకాశంగా తీసుకునేందుకు నెటిజెన్లు రెడీగా ఉన్నారు. అల్లు అర్జున్ స్పీచ్ తో పాటు విజయ్ దేవరకొండ మాటలే వారి టార్గెట్. ఆగస్ట్ 15న విడుదల కానున్న గీత గోవిందంపై పాజిటివ్ బజ్ ఉంది. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలన్నీ ఆశించిన ఫలితం ఇవ్వని నేపధ్యంతో పాటు అర్జున్ రెడ్డి తర్వాత ఇంత గ్యాప్ తీసుకుని సోలో హీరోగా విజయ్ దేవరకొండ చేస్తున్న మూవీగా ఇప్పటికే దీని మీద అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. పైగా ట్రైలర్ కట్ చేసిన తీరు యూత్ నే కాదు సాధారణ ప్రేక్షకులలో కూడా దీని వైపు ఆసక్తి రేపెలా చేసింది. ఎ సెంటర్స్ లో అక్షయ్ కుమార్ హిందీ సినిమా గోల్డ్ తప్ప ఇంకే పోటీ లేకుండా సోలోగా బరిలో దిగుతున్న గీత గోవిందం హైప్ కు తగ్గట్టు ఉంటే మాత్రం వసూళ్ల రచ్చ ఖాయంగా కనిపిస్తోంది.