Begin typing your search above and press return to search.

సెన్సేషన్ అయ్యేంత సీనుందా??

By:  Tupaki Desk   |   13 Feb 2018 11:33 AM GMT
సెన్సేషన్ అయ్యేంత సీనుందా??
X
ప్రియా ప్రకాష్ వారియర్ గురించి సెర్చ్ చేయని యూత్ కానీ.. ఆమె కన్ను కొడుతున్న వీడియో అందని వాట్సాప్ నెంబర్ కానీ లేవేమో అనడం అతిశయోక్తి కాదు. కొన్ని రోజుల వ్యవధిలోనే అంతగా గుర్తింపు పొందేసింది మలయాళీ నటి ప్రియా వారియర్. కేవలం 26 సెకన్ల వీడియో.. ఆ తర్వాత విడుదల చేసిన పూర్తి సాంగ్ కారణంగా.. ఈమెకు దక్కిన గుర్తింపు అసామాన్యం అనాల్సిందే.

అయితే.. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే అనే విషయం గుర్తుంచుకోవాలి. నిజంగానే ఇంతటి గుర్తింపు దక్కినందుకు ఈ భామ సంతోషిస్తున్నా.. దీన్ని నిలబెట్టుకోవడం క్లిష్టమైన విషయం. దానికి తగినట్లుగా పెర్ఫామెన్స్ చూపించాల్సి ఉంటుంది. వచ్చే నెలలో ఈమె నటించిన ఒరు అడార్ లవ్ విడుదల కానుండగా.. ఇప్పుడీ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోవడం ఖాయం. మరోవైపు ఈ భామ అనుపమ పరమేశ్వరన్ రేంజు అందగత్తె కాదు అనే సంగతి ఒప్పుకోవాల్సిందే.

మరో ప్రక్కన ఆ కళ్ళు తిప్పడం తప్పించి ఇంకో టాలెంట్ ఏమీ పెద్దగా చూపించినదేమీ లేదు. ఆ మాత్రానికే ఎలా వైరల్ అయిపోయింది అనే పాయింట్ చూస్తే.. హావభావాలే కీలకం. ఒకవేళ రేపు సినిమాలో తన నటనతో ఈ క్రేజ్ నిలబెట్టుకోకపోతే ఈ పిల్ల పరిస్థితి ఏంటి? అనే ఆలోచన చేయడం కూడా కష్టమే. ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువ అయిపోతే ఎంతమంది ఎంతగా ఇబ్బంది పడ్డారో గతంలో కూడా చూశాం. మరి ఈ భామ పరిస్థితి ఏంటో?