Begin typing your search above and press return to search.

హీట్ పెంచుతున్న హ‌ను పీరియ‌డ్ వార్ డ్రామా

By:  Tupaki Desk   |   30 Aug 2021 4:55 AM GMT
హీట్ పెంచుతున్న హ‌ను పీరియ‌డ్ వార్ డ్రామా
X
దుల్కర్ సల్మాన్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం `లెఫ్టినెంట్ రామ్`. హను రాఘవపుడి ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్ని స్వప్న సినిమా- వైజయంతి ఫిల్మ్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. స్వాప్నా దత్ నిర్మాత‌. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ చిత్రం షూటింగ్ మెజారిటీ భాగం హిమ‌చ‌ల్ ప్ర‌దేశ్ క‌శ్మీర్ ప‌రిస‌రాల్లో సాగుతోంది. లొకేష‌న్ల‌ కోసం హను తన కీల‌క‌ సిబ్బందితో పాటు వేట సాగించిన సంగ‌తి తెలిసిందే. త‌దుప‌రి చిత్రీక‌ర‌ణ హిమాచల్ ప్రదేశ్ లో జ‌రుగనుంది. కోవిడ్ వ‌ల్ల చిత్రీక‌ర‌ణ‌లు కొంత ఆల‌స్య‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభిస్తారని తెలిసింది.

త‌దుప‌రి షెడ్యూల్ లో ఇందులో విల‌న్ గా న‌టిస్తున్న అశ్వ‌త్ భ‌ట్ చేర‌నున్నారు. ఆ మేర‌కు తాజా ఇంట‌ర్వ్యూలో అత‌డు ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఇది పీరియడ్ వార్ డ్రామా.. బిగ్గ‌ర్ స్కేల్ లో తెర‌కెక్కుతోంది. ఇందులో విల‌న్ పాత్ర‌కు అంతే ప్రాధాన్య‌త ఉంది. హైదర్- కేసరి- రాజి వంటి చిత్రాలకు పని చేసిన నటుడు అశ్వత్ భట్ ఇప్పుడు ఈ కొత్త ప్రాజెక్ట్ కి ప్ర‌ధాన బ‌లం కానున్నారు. అతను ఇందులో విల‌న్ పాత్ర పోషిస్తున్నాడు. అశ్వత్ 2014 లో గ్యాంగ్ స్టర్ చిత్రంలో దుల్కర్ తండ్రి మమ్ముట్టితో కలిసి పనిచేశాడు. ఇప్పుడు తన కుమారుడితో స్క్రీన్ పంచుకుంటున్నాడు. అశ్వ‌త్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్‌ఎస్‌డి) స్టూడెంట్. ఈ సినిమాలో తనకు బెస్ట్ రోల్ లభించిందని చెప్పారు.

``నేను ఎప్పుడూ ఒక నిర్ధిష్ఠ‌మైన బాక్స్ లో ఉండాల‌ని అనుకోను. ఎల్లప్పుడూ బహుముఖ ప్రజ్ఞ కోసం చూస్తాను. ఒక పాత్రను పోషించడం నన్ను భయపెట్టకపోతే అది విలువైనది కాదు. నేను ఇంతకు ముందు తెలుగు చిత్రనిర్మాతల నుండి ఆఫర్లను పొందాను కానీ ఈ చిత్రం నటుడిగా నా నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి నన్ను అనుమతిస్తుంది`` అని తెలిపారు. నా కంటే భిన్నమైన వయస్సు గల పాత్రను పోషిస్తాను. మీరు నన్ను తెరపై కూడా గుర్తించలేరు. నాకు తెలుగు ఎలా మాట్లాడాలో తెలిసినప్పటికీ ఈ సినిమాలో నా పాత్ర హిందూస్తానీలో మాట్లాడుతుంది అని ఆయన అన్నారు.

క‌శ్మీర్ -మ‌నాలి హిమ‌చ‌ల్ ప్ర‌దేశ్ ప‌రిస‌రాల్లో ఇటీవ‌ల షూటింగులు పెరిగాయి. అక్క‌డ అంద‌మైన‌ మంచు కొండ‌ల్లోని ప్ర‌కృతి అందాల‌ను క‌వ‌ర్ చేస్తూ అద్భుత లొకేష‌న్ల‌ను తెర‌పై ఆవిష్క‌రిస్తున్నారు ద‌ర్శ‌కులు. ఇంత‌కుముందు స‌త్య‌దేవ్ న‌టించిన హిందీ సినిమాని మ‌నాలి -హించ‌ల్ లోని అంద‌మైన లొకేష‌న్ల‌లో తెర‌కెక్కించ‌గా ఇప్పుడు హ‌ను రాఘ‌వ‌పూడి కూడా అవే లొకేష‌న్ల‌లో షూటింగులు చేస్తుండ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. ఒక అంద‌మైన ప్రేమ‌క‌థ‌ను వార్ డ్రామాతో మిళితం చేసి లెఫ్టినెంట్ రామ్ చిత్రాన్ని హ‌ను తెర‌కెక్కిస్తున్నారు.

అందాల రాక్ష‌సి..కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాధ చిత్రాల‌తో ప్రేమ‌క‌థా చిత్రాల స్పెష‌లిస్ట్ ద‌ర్శ‌కుడిగా అత‌డు త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త ఉంద‌ని నిరూపించారు. ఆ త‌ర్వాత ఒడిదుడుకులు ఎదుర‌వుతున్నా అవ‌కాశాల ప‌రంగా కొద‌వేమీ లేదు. కెరీర్ కీల‌క ద‌శ‌లో శ‌ర్వానంద్ హీరోగా తెర‌కెక్కించిన ప‌డి ప‌డి లేచే మ‌న‌సు చిత్రం డిజాస్ట‌ర్ అవ్వ‌డం అత‌డికి కెరీర్ ప‌రంగా కొంత మైన‌స్ అయ్యింది. అయినా హ‌నులోని టెక్నిక‌ల్ క్వాలిటీస్.. స్టోరీ రైటింగ్ నైపుణ్యం.. ఇంటెన్స్ ల‌వ్ స్టోరీ ఎలివేష‌న్ దృష్ట్యా అత‌డి ఎంపిక‌లపై న‌మ్మ‌కంతో వెంట వెంట‌నే ఆఫ‌ర్ల‌కు కొద‌వైతే లేదు. స్క్రీన్ ప్లేలో చిన్న‌పాటి త‌ప్పిదాల‌ను స‌రి చేసుకుని అత‌డు కంబ్యాక్ అయ్యే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. `లెఫ్టినెంట్ రామ్` చిత్రంతో అత‌డు బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టి కంబ్యాక్ అవుతార‌నే అభిమానులు భావిస్తున్నారు.