Begin typing your search above and press return to search.
చిరంజీవికి క్రిష్ణంరాజు ఇచ్చిన ఖరీదైన బహుమతేంటో తెలుసా?
By: Tupaki Desk | 11 Sep 2022 1:35 PM GMTతెలుగు చిత్ర పరిశ్రమలో రెబల్ స్టార్ గా తనదైన ముద్ర వేసి తరలిరాని లోకాలకు వెళ్లిపోయారు ఉప్పలపాటి వెంకట క్రిష్ణం రాజు. తెరపై దాదాపు 180 సినిమాల్లో వివిధ పాత్రలను పోషించిన ఆయన.. వాటికి మించిన పేరును తెర బయట సంపాదించారు. విజయనగర క్షత్రియ వంశానికి చెందిన క్రిష్ణంరాజు సినిమాల్లోకి రాకముందే సంపన్నులు. సినిమాల్లోకి వచ్చాక కూడా పెద్దగా ఇబ్బంది పడింది లేదు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ సందర్భంలో చెప్పారు. ఓ దశలో తనకు అవకాశాలు క్లిష్టంగా కనిపించగా.. స్వయంగా నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసుకుని సినిమాలు తీశారు. అదీ క్రిష్ణం రాజు స్థాయి.
ఒకే ఊరు నుంచి ఇద్దరు స్టార్లు
తెలుగు చిత్ర పరిశ్రమలో 1970 దశకం కీలకమైనది. అప్పటికే ఎన్టీఆర్, ఏఎన్నార్ సూపర్ స్టార్లుగా వెలిగిపోతుండగా.. 70వ దశకంలో క్రిష్ణ, క్రిష్ణంరాజు, శోభన్ బాబులు స్టార్లుగా ఎదిగారు. వీరి మధ్యలో.. 70వ దశకం చివరలో వెలుగులోకి వచ్చాడో స్టార్. ఆయనే.. చిరంజీవి. చిన్న నటుడి నుంచి మొదలైన ఆయన ప్రస్థాన నేడు మెగా స్టార్ గా కొనసాగుతోంది. ఇక్కడో విశేషం ఏమంటే.. క్రిష్ణంరాజు, చిరంజీవిది ఒకే ఊరు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు. చిరంజీవి వచ్చేటప్పటికే క్రిష్ణంరాజు సినిమాల్లో స్టార్ గా ఉండేవారు. దీంతో ఆయన గురించి వారి ఊరిలో గొప్పగా చెప్పుకునేవారు.
ప్రారంభంలోనే ఇద్దరూ కలిసి చిరంజీవి ప్రారంభంలోనే క్రిష్ణంరాజుతో నటించే అవకాశం కలిగింది. ఆ సమయంలోనే చిరంజీవిది కూడా తన సొంత గ్రామం మొగల్తూరు అని క్రిష్ణంరాజుకు తెలిసింది. నాటి నుంచి మొదలైన అనుబంధం కడవరకు కొనసాగింది. క్రిష్ణం రాజు రెబల్ స్టార్ గా, చిరంజీవి మెగస్టార్ గా ఎదిగారు. చివరకు 2008లో చిరంజీవి ప్రజారాజ్య పార్టీ స్థాపించగా ఆ పార్టీ తరఫున రాజమండ్రి నుంచి క్రిష్ణంరాజు ఎంపీగా పోటీ చేశారు. ఇక వ్యక్తిగతంగా చూస్తే క్రిష్ణం రాజును చిరంజీవి అన్నయ్య అని పిలుస్తారు.
దానంలో పెద్ద చేయి
క్రిష్ణం రాజుది దాన గుణం. ఆయన ఇంటికి వెళ్లినవారికి అత్యంత భారీగా భోజనం వడ్డిస్తారనే పేరుంది. స్వతహాగానే భోజన ప్రియుడైన క్రిష్ణంరాజు.. షూటింగ్ లో ఉన్నవారందరికీ ఇంటి నుంచి భోజనం తెప్పించేవారని చెబుతారు. కాగా, క్రిష్ణం రాజు ఓ సందర్భంలో చెప్పినదాని ప్రకారం.. దాదాపు 35 ఏళ్ల కిందట లండన్ నుంచి ఖరీదైన కెమెరా తెప్పించారు. ఓ ఫంక్షన్ లో దానిని చిరంజీవి చూసి అత్యంత ఆశ్చర్చపోయారు. ''ఎక్కడిది అన్నయ్య ఇంత ఖరీదైన కెమెరా..? లండన్ లో దీనిని చూశాను. ఇష్టపడినప్పటికీ కొందామంటే చాలా ఖరీదు అవుతుందని వదిలేశాను'' అని క్రిష్ణంరాజుతో అన్నారు. ఈ మాటలు విన్న మరుక్షణమే క్రిష్ణంరాజు మరో ఆలోచన లేకుండా ట్యాగ్ తో ఉన్న కెమెరాను చిరంజీవి మెడలో వేశారు. దీంతో ఆశ్చర్య పోవడం చిరంజీవి వంతైంది. అదీ.. చిరంజీవికి క్రిష్ణం రాజు ఇచ్చిన ఖరీదైన బహుమతి సంగతి.