Begin typing your search above and press return to search.

ఐదు కథల ప్రయాణమే 'ఎక్స్ ప్రెస్ రాజా'

By:  Tupaki Desk   |   10 Jan 2016 7:30 PM GMT
ఐదు కథల ప్రయాణమే ఎక్స్ ప్రెస్ రాజా
X
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీతో ప్రామిసింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న మేర్లపాక గాంధీ... తన ద్వితీయ చిత్రం కోసం దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకున్నాడు. ద్వితీయ విఘ్నం వుండరాదనే ఎంతో పక్కాగా ప్లాన్ చేసుకుని ‘ఎక్స్ ప్రెస్ రాజా’ మూవీని తెరకెక్కించా అంటున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 14న సంక్రాంతి సందర్భంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకొస్తోంది. బాలయ్య నటించిన డిక్టేటర్ లాంటి పెద్ద సినిమా విడుదల రోజే ఈ సినిమా విడుదలవుతోంది కదా టెన్షన్ లేదా అంటే.. నా సినిమాలో కంటెంట్ వుంది... సో అదే ధైర్యంతోనే రిలీజ్ చేస్తున్నా అంటున్నాడు. ఇంతకు సినిమా కథ ఏంటని ప్రశ్నిస్తే... ఐదు కథల ప్రయాణమే ఎక్స్ ప్రెస్ రాజా స్టోరీ అన్నాడు. వైజాగ్ బేస్డ్ గా ప్రారంభమైయ్యే కథ మొదట్లో పోసాని కృష్ణ మురళి, ప్రభాస్ శ్రీనుతో ప్రారంభమై ఆ తరువాత సప్తగిరి, హరీషోత్తమ్, షకలక శంకర్ లాంటి వారితో ఐదు కథల ప్రయాణం సాగుతుందని... వీటిని హీరో ఎలా రిసాల్వ్ చేసుకుంటూ... తన లవ్ ను దక్కించుకున్నాడనేదే మిగతా కథ అంటున్నాడు.

ఫన్ అండ్ లవ్ స్టోరీతో సాగే ఈ మూవీని.. ఎక్కువ భాగం నెల్లూరు జిల్లాలోని కావలి తదితర ప్రాంతాల్లో షూట్ చేసినట్లు చెబుతున్నాడు. హాలీవుడ్ మూవీ వింటేజ్ పాయింట్ మూవీ స్క్రీన్ ప్లేలా ఈ మూవీ స్క్రీన్ ప్లే వుంటుదని చెబుతున్నాడు. హీరోయిన్ సురభి ఇందులో అబద్దాలంటే అస్సలు ఇష్టపడని ఓ టిపికల్ అమ్మాయిగా నటిస్తోందట. ఈ కథకు ఆమెను యాప్ట్ ని భావించి తానే ఆమెను సెలక్ట్ చేసుకున్నట్టు చెబుతున్నాడు. తన తరువాతి సినిమాను మాత్రం యు.వి.క్రియేషన్స్ లోనే మరో మూడు నెలల్లో ప్రారంభిస్తాని చెబుతున్నాడు. హీరో ఎవరనేది త్వరలోనే చెబుతా అన్నాడు. ఎంతో ప్యాషన్ తో సినిమాలు తీసే యు.వి.క్రియేషన్స్ నిర్మాతలతో ప్రయాణం చేయడం చాలా బాగుందని చెప్పాడు. ప్రభాస్ ఈ సినిమాను చూసి బాగా నవ్వేశారని, తప్పకుండా సంక్రాంతికి ఓ మంచి సినిమా అవుతుందని అభినందించినట్లు చెప్పాడు దర్శకుడు మేర్లపాక గాంధీ. తాను ఎప్పుడూ హీరోలను దృష్టిలో వుంచుకుని స్క్రిప్టు రెడీ చేయనని... కథను సిద్ధం చేసిన తరువాతే హీరో ఎవరైతే బాగుంటారనేది నిర్ణయించుకుంటాని సెలవిచ్చాడు.