Begin typing your search above and press return to search.

ఎక్స్‌ ప్రెస్ రాజాకి కామెడీనే అస్సెట్‌

By:  Tupaki Desk   |   8 Jan 2016 4:57 AM GMT
ఎక్స్‌ ప్రెస్ రాజాకి కామెడీనే అస్సెట్‌
X
రోటీన్ మూస కామెడీకి - రియ‌లిస్టిక్ కామెడీకి మ‌ధ్య ప్ర‌చ్ఛ‌న్న‌ యుద్ధం జ‌రుగుతోందిప్పుడు. ఇంకా చెప్పాలంటే కోన అండ్ గ్యాంగ్ క్రియేట్ చేసే కామెడీకి, ఇత‌ర‌త్రా ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌లు క్రియేట్ చేసే కామెడీకి మ‌ధ్య వార్ న‌డుస్తోంద‌ని చెప్పొచ్చు. ఫ్రెష్ ట్యాలెంట్ ఇన్నోవేటివ్ ఐడియాస్‌ తో క్రియేట్ చేసే ప్ర‌తిదీ ఇటీవ‌లి కాలంలో స‌క్సెస‌వుతోంది. సుధీర్ వ‌ర్మ‌ - మేర్ల‌పాక గాంధీ - అనీల్ రావిపూడి - సుదీప్‌ వంటి ర‌చ‌యిత‌లు ద‌ర్శ‌కులుగా స‌క్సెస్ అవ్వ‌డం వెన‌క అస‌లు లాజిక్ అదే.

జంధ్యాల రోజుల్లోని స్వ‌చ్ఛ‌మైన హాస్యం కావాలిప్పుడు. అలాంటి టైమింగ్ కావాలిప్పుడు. అందుకే ఈ సంక్రాంతికి రిలీజ‌వుతున్న ఎక్స్‌ప్రెస్ రాజా మూవీపై భారీ అంచ‌నాలేర్ప‌డ్డాయి. పోటీ బ‌రిలో ఎన్టీఆర్‌ - బాల‌కృష్ణ‌ - నాగార్జున వంటి స్టార్లు ఉన్నా శ‌ర్వానంద్ ఎంతో కాన్ఫిడెంట్‌ గా ఉన్నాడంటే అత‌డి సినిమాలోని రియ‌లిస్టిక్ కామెడీ అంత బాగా వ‌ర్క‌వుట‌వుతుంద‌న్న న‌మ్మ‌కంతోనే. ఈ చిత్రానికి వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్ ఫేం మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. త‌న మొద‌టి సినిమాని మించి ఈ సినిమాలో కామెడీ ఇన్‌ పుట్స్ ఉన్నాయ‌ని చెబుతున్నారు. సంక్రాంతి బ‌రిలో శ‌ర్వానంద్ కాన్ఫిడెంట్ హిట్ కొడుతున్నాడ‌ని అంచ‌నాలేస్తున్నారంతా. ఓ వైపు దిల్ రాజు లాంటి టేస్ట్‌ ఫుల్ ప్రొడ్యూస‌ర్ ఈ చిత్రాన్ని నైజాంలో రిలీజ్ చేయ‌డం కూడా అంచ‌నాల్ని పెంచుతోంది.

ఇప్ప‌టికే సెన్సార్ పూర్త‌యింది. క్లీన్‌ యు స‌ర్టిఫికెట్ ఇచ్చి సెన్సార్ బృందం ప్ర‌శంసించింది. శ‌ర్వానంద్ ర‌న్ రాజా ర‌న్ చిత్రంతో కాన్ఫిడెంటుగా క‌మ‌ర్షియ‌ల్ హిట్ అందుకున్నాడు. మ‌రోసారి అంత‌కుమించిన హిట్ కొట్టాల‌ని ఎక్స్‌ ప్రెస్‌ రాజా చిత్రంతో వ‌స్తున్నాడు. కోన అండ్ గ్యాంగ్ క్రియేట్ చేసిన డిక్టేట‌ర్ జ‌నాల‌కు న‌చ్చుతాడో, లేక మేర్ల‌పాక గాంధీ క్రియేట్ చేసిన ఎక్స్‌ప్రెస్ రాజా గెలుస్తాడో వేచి చూడాలి. శ‌ర్వా మ‌రో విజ‌యం ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.