Begin typing your search above and press return to search.

ఎక్స్ ప్రెస్ రాజా వారంలో పనైపోద్ది

By:  Tupaki Desk   |   16 Jan 2016 8:11 PM GMT
ఎక్స్ ప్రెస్ రాజా వారంలో పనైపోద్ది
X
సంక్రాంతికి బడా సినిమాల మధ్య ‘ఎక్స్ ప్రెస్ రాజా’ను రిలీజ్ చేస్తుంటే చాలా పెద్ద రిస్క్ చేస్తున్నట్లు అనిపించింది కానీ.. ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఆ సినిమా పెర్ఫామెన్స్ చూస్తుంటే దాని మీద పెట్టుకున్న సందేహాలన్నీ పటాపంచలైపోతున్నాయి. కేవలం రూ.7 కోట్ల లో బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిన్న సినిమా కేవలం రెండు రోజుల్లోనే రూ.3.5 కోట్లు వసూలు చేసి అందరికీ షాకిచ్చింది. అంటే సగం పెట్టుబడి రెండు రోజుల్లోనే వచ్చేసిందన్నమాట. శని, ఆదివారాల్లోనూ రాజా పరుగు కొనసాగితే పెట్టుబడిలో 80 శాతం రికవర్ అయిపోయే అవకాశముంది. కాబట్టి వారానికల్లా బయ్యర్లందరూ సేఫ్ జోన్లోకి వచ్చేయడం ఖాయం.

సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో అతడి తక్కువ నెగెటివ్ టాక్ తెచ్చుకున్నది ‘ఎక్స్ ప్రెస్ రాజా’నే. డిక్టేటర్ సినిమాలో ఏమీ కొత్తదనం లేదన్న టాక్ రాగా.. ‘నాన్నకు ప్రేమతో’ మాస్ ఆడియన్స్ కు నచ్చే అవకాశం లేదన్న మాటలు వినిపించాయి. ‘సోగ్గాడే చిన్నినాయనా’లోనూ కొత్తదనం లేదన్న టాక్ వినపడింది. ‘ఎక్స్ ప్రెస్ రాజా’ విషయంలో మాత్రం ఎక్కువగా పాజిటివ్ టాకే వచ్చింది. సంక్రాంతికి మిగతా సినిమాలన్నింటికంటే తక్కువ థియేటర్లలో రిలీజైనప్పటికీ.. ఆ సినిమా స్థాయికి అది పెద్ద రిలీజే. బడా సినిమాల మధ్య ఇంత పోటీలోనూ హౌస్ ఫుల్స్ తో నడుస్తుండటం గొప్ప విషయమే. థియేటర్లు దొరక్కపోవడం వల్ల కర్ణాటక, చెన్నై సహా ఇతర రాష్ట్రాల ఏరియాల్లో ‘ఎక్స్ ప్రెస్ రాజా’ను రిలీజ్ చేయలేకపోయారు. 22న ఆ ఏరియాల్లో రిలీజయ్యే అవకాశముంది.