Begin typing your search above and press return to search.

నందమూరి హీరోల మధ్య గర్జించబోతున్నాడు

By:  Tupaki Desk   |   30 Dec 2015 3:48 AM GMT
నందమూరి హీరోల మధ్య గర్జించబోతున్నాడు
X
ఈ ఏడాది శర్వానంద్ విజయంతోనే కొత్త ఏడాదిని ప్రారంభించాడు. గతేడాది ‘రన్ రాజా రన్’తో సందడి చేసి.. ఈ ఏడాది ‘మళ్లీ మళ్లీ ఇది రానీ రోజు’ లాంటి ఓ లవ్ స్టోరీ మూవీతో విజయాన్ని అందుకున్నాడు. మరోసారి కొత్త ఏడాదిని కూడా విజయంతోనే ప్రారంభించాలని సంక్రాంతికి ‘ఎక్స్ ప్రెస్ రాజా’గా సందడి చేయడానికి రెడీ అయిపోతున్నాడు. వరుసగా విజయవంతమైన చిత్రాలను తెరకెక్కిస్తున్న వంశీ-ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ ఏడాది వీరు నిర్మించిన భలే భలే మగాడివోయ్ సినిమా ఘన విజయం సాధించింది. గతంలో ‘రాన్ రాజా రన్’ చిత్రాన్ని నిర్మించిన ఈ నిర్మాతలే ఇప్పుడు ‘ఎక్స్ ప్రెస్ రాజా’ చిత్రాన్ని ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’లాంటి హిట్ సినిమాకు దర్శకత్వం వహించిన మేర్లపాక గాంధీ డైరెక్షన్లో తెరకెక్కించారు. ఈ చిత్రం సంక్రాంతి రోజు జనవరి 14న రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

అదే రోజు బాలకృష్ణ నటించిన ‘డిక్టేటర్’ మూవీ కూడా రిలీజ్ అవుతోంది. ఈ రెండు సినిమాలు ఆడియో రిలీజ్ ను కంప్లీట్ చేసుకున్నాయి. ఈ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ కావడం ఒకింత ఆసక్తికరమే. ఎందుకంటే.. రెండు సినిమాల థియేట్రికల్ ట్రైలర్స్ పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్నాయి. డిక్టేటర్ సినిమాతో మరోసారి బాలయ్య గర్జించబోతున్నాడు. ఈ సినిమా రిలీజ్ డేట్ ను మరోసారి దర్శకుడు శ్రీవాస్ కన్ ఫర్మ్ చేసేశాడు. దాంతో ఇక డిక్టేటర్ వచ్చేది సంక్రాంతి రోజే అని తేలిపోయింది. ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ సినిమా కూడా సంక్రాంతికే రిలీజ్ కాబోతోంది. ఇటీవలే ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కూడా జరిగింది. ట్రైలర్ లో ఎన్టీఆర్ ఎంతో స్టైలిష్ గా వున్నాడు. మరి ఇద్దర నందమూరి హీరోల మధ్య ఎక్స్ ప్రెస్ రాజా ఏమాత్రం నిలబడగలడో వేచి చూడాలి.