Begin typing your search above and press return to search.
కబీర్ ఖాన్ ని చంపేస్తామంటూ ఉగ్ర బెదిరింపులు!
By: Tupaki Desk | 16 May 2022 11:30 AM GMTబాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కబీర్ ఖాన్ ని ఉగ్రవాదులు బెదిరించడంతో ఒక్కసారిగా బాలీవుడ్ ఉలిక్కి పడింది. ఐదుగురు ఉగ్రవాదులు కబీర్ ఖాన్ ని చంపేస్తామంటూ బెదింరించడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కబీర్ సహా మిగతా టీమ్ సభ్యుల్ని మట్టుబెడతామని ఉగ్రవాదులు హెచ్చరించారు. ఈ విషయాన్ని కబీర్ ఖాన్ మీడియాకి వెల్లడించడంతో బాలీవుడ్ అంతటా చర్చనీయాంశంగా మారింది.
ఇంతకీ కబీర్ ఖాని ని ఉగ్రమకలు ఎందుకు బెదిరించినట్లు? ఫిల్మ్ మేకర్ ని అంతగా హెచ్చరించడానికి గల కారణాలు ఏంటి? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. ఆ విషయాలు నేరుగా కబీర్ మాటల్లోనే తెలుసుకుందాం.--ఓ రోజు ఇండియన్ ఎంబసీ నుంచి కాల్ వచ్చింది. హీరో ఎలా ఉన్నారని యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. షూటింగ్ లో ఉన్న విషయాన్ని చెప్పాను.
షూట్ పూర్తయిన తర్వాత ఆఫీస్ కి రాగలరా? అన్నారు. దానికి నేను సరే అన్నాను. దౌత్యకార్యలయానికి వెళ్లగానే అక్కడ భారతీయ రాయబారితో పాటు..సైనికులున్నారు. నన్ను లోపలికి తీసుకెళ్లి మీకు తాలిబన్ల నుంచి ప్రాణహాని ఉందనే విషయాన్ని అమెరికా-ఆప్ఘనిస్తాన్ ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయని చెప్పారు. మీతో సహా షూటింగ్ లో పాల్గొంట వారందర్నీ చంపేస్తామని బెదిరించారని చెప్పారు.
దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యాను .ఆందోళనకి గురయ్యాను. వెంటనే టీమ్ మొత్తాన్ని అప్రమత్తం చేసాను. ఆసమయంలో ఆప్ఘన్ సైన్యం తోడుగా నిలిచింది. వాళ్ల పహారాలోనే షూటింగ్ మొత్తం పూర్తిచేసాం. బెదిరింపులకు బయపడొద్దని..ఎవరొస్తారో చూస్తామని ఆప్ఘన్ సైన్యం భరోసా కల్పించింది. వెనుదిరిగితే ఓడిపోయినట్లు అవుతుంది. ధైర్యంగా షూటింగ్ చేసుకోండి ఎవరో చూస్తామని సైన్యం ముందుకు రావడంతో ఎలాంటి భయాందోళన లేకుండా షూటింగ్ పూర్తిచేసాం. పాకిస్తాన్-ఆప్షన్ సరిహద్దులో షూటింగ్ జరుగుతుండగా బెదిరింపులు వచ్చాయని-- కబీర్ తెలిపారు.
ఇలాంటి ఉగ్ర బెదిరింపులు బాలీవుడ్ కి కొత్తేంకాదు . గతంలో సల్మాన్ ఖాన్..షారుక్ ఖాన్ సైతం ఇలాంటి వాటిని ఎదుర్కున్నారు. ముస్లీం మనోభావాలకు అతీతంగా ఖాన్ ల సినిమాలుంటున్నాయని అరోపణల నేపథ్యంలో ఇలాంటి బెదిరింపులు ఫేస్ చేసారు. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ని అయితే ఏకంగా ముంబై మాఫియానే బెదిరించినట్లు గతంలో వార్తలొచ్చాయి.
ప్రస్తుతం కబీర్ ఖాన్ పై బెదిరింపు వ్యాఖ్యలు బాలీవుడ్ లో చర్చనీయాంశగా మారాయి. కబీర్ ఖాన్ -కాబూల్ ఎక్స్ ప్రెస్- అనే సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత -న్యాయార్క్-..-ఏక్ థా టైగర్-..-భజరంగీ భాయిజాన్-..-ఫాంటమ్-.. -ది ఫర్గాటన్ ఆర్మీ- లాంటి చిత్రాల్ని తెరకెక్కించారు. ఇటీవలే కబీర్ తెరకెక్కించిన స్పోర్స్ట్ బ్యాక్ డ్రాప్ మూవీ -83- రిలీజ్ అయింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా వాటిని అందుకోలేక పోయింది.