Begin typing your search above and press return to search.

హనీ ఈజ్ ది బెస్ట్ కానీ యాటిట్యూడే తేడా అంట!

By:  Tupaki Desk   |   31 Dec 2019 6:08 AM GMT
హనీ ఈజ్ ది బెస్ట్ కానీ యాటిట్యూడే తేడా అంట!
X
ఎక్కడైనా.. ఏ రంగంలో అయినా ఎక్కువ కాలం కొనసాగాలి అంటే ప్రవర్తన సరిగ్గా ఉండడం చాలా ముఖ్యం. నలుగురితో మనం ప్రవర్తించే తీరు సరిగా లేకపోతే కెరీర్ దెబ్బ తినడం ఖాయమే. సక్సెస్ లో ఉన్నప్పుడు మనం దురుసుగా ప్రవర్తించినా ఊరుకుంటారు.. అయితే అదే జనాలు మనం ఫెయిల్యూర్ లో ఉన్నప్పుడు మన తోలు తీస్తారు. ఈ విషయం గుర్తు పెట్టుకోవడం ఎవరికైనా మంచిదే. అయితే ఒక టాలీవుడ్ హీరోయిన్ మాత్రం తను పని చేసే సినిమా యూనిట్ల కు చుక్కలు చూపిస్తూ చెడ్డపేరు తెచ్చుకుందనే టాక్ వినిపిస్తోంది.

ఈ భామకు పోయిన ఏడాది(2018) పెద్దగా కలిసి రాలేదు. నటించిన సినిమాలన్నీ తుస్సుమన్నాయి. ఇక అమ్మడు తట్టా బుట్టా సర్దుకునే సమయం ఆసన్నమైందనే టాక్ కూడా వినిపించింది.. అయితే ఈ ఏడాది(2019) మొదట్లో నటించిన సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో అమ్మడికి కెరీర్ మళ్లీ ఊపందుకుంది. అయితే తన ప్రవర్తన తో నిర్మాతలను తను పని చేసే సినిమా యూనిట్లను ఇబ్బంది పెడుతోందని మాత్రం గట్టిగా టాక్ వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత ఎక్కువగా ఉంది. దీంతో కొందరు నిర్మాతలు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ భామను భరిస్తున్నారట. ఈ బ్యూటీ నటిస్తున్న ఏ సినిమా యూనిట్ సభ్యులను అడిగినా 'ఆ హీరోయిన్ కో దండం' అంటున్నారట.

అలా అని ఈ భామ అద్భుతమైన నటన కనబరుస్తుందా అంటే అదీ లేదు. యావరేజ్ నటనతోనే ఏదో అలా నెట్టుకొస్తోంది. అయితే ఈ భామ రాబోయే సంక్రాంతి సినిమాలో నటిస్తోంది. ఆ సినిమాలో మాత్రం మెరుగైన నటన ప్రదర్శించిందని.. ఇప్పటివరకూ నటించిన సినిమాల్లో ఇదే బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని అంటున్నారు. ఈ భామ తన ప్రవర్తన ఇప్పటికైనా మార్చుకుంటే మంచిదని.. లేకపోతే ఫ్యూచర్ లో అవకాశాలు రావడం కష్టం అవుతుందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.