Begin typing your search above and press return to search.

మాస్ ప్రేక్షకులకు దిల్ రాజు గేలం

By:  Tupaki Desk   |   21 Jan 2019 5:32 AM GMT
మాస్ ప్రేక్షకులకు దిల్ రాజు గేలం
X
బాక్స్ ఆఫీస్ వద్ద జోరును కొనసాగిస్తున్న ఎఫ్2 ఇప్పట్లో తగ్గేలా లేదు. అంతకంతా వసూళ్ళ ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. కామెడీ ఎంటర్ టైన్మెంట్ కావడంతో ముఖ్యంగా ఫ్యామిలీస్ దీనికి భారీగా క్యు కడుతున్నారు. ఇకపోతే ఇందులో మాస్ మసాలా అంశాలు లేవనే టాక్ బయటికి వినిపించడంతో దిల్ రాజు అలెర్ట్ అయిపోయారు. ఇందులో ఉన్న ఒకే ఒక్క మసాలా సాంగ్ గిర్రా గిర్రాని ప్రత్యేకంగా వీడియో రూపంలో కట్ చేయించి తన స్వంత ఛానల్ లోనే పోస్ట్ చేసారు. ఇది రెండు రోజులు దాటకుండానే అర మిలియన్ వ్యూస్ దాటేయడం విశేషం.

ఈ పాటలో అసలు ఆకర్షణ తమన్నా మెహ్రీన్లు పోటీ పడి లుంగీ డాన్సులు చేస్తూ నడుమును ఫుల్ గా ఎక్స్ పోజ్ చేస్తూ ఊర నాటు స్టెప్స్ తో రచ్చ చేయడమే. ఒకదశలో వెంకీ వరుణ్ లు పాటలో ఉన్నారన్న ధ్యాస కూడా రాకుండా ఇద్దరూ మేజిక్ చేసి పారేసాడు. ముఖ్యంగా తమన్నా ఓ రేంజ్ లో రెచ్చిపోయిందనే చెప్పాలి. నిజానికి ఇంత హెల్తీ ఎంటర్ టైన్మెంట్ ఇలాంటి మసాలా పాట అవసరమా అనే కామెంట్స్ కూడా విడుదల రోజే వినిపించాయి. సరేఒకటే కదా అని కుటుంబ ప్రేక్షకులు సర్దుకుపోవడంతో అదేమంత హై లైట్ అవ్వలేదు.

ఇప్పుడు ఈ వీడియో చూసాక అరె ఫుల్ సాంగ్ ఇంకే రేంజ్ లో ఉందొ అని సినిమా చూడని ప్రేక్షకులకు అనిపించడం సహజం. దిల్ రాజు టార్గెట్ కూడా అదే లెండి. జై లవకుశలో జూనియర్ ఎన్టీఆర్ సరసన ఇలాంటి నడుము ఊపే పాట మిల్కీ చేసినప్పటికీ దానికి డబుల్ డోస్ లో ఉన్న ఈ గిర్రా గిర్రా పాటను పబ్లిసిటీకి ఉపయోగించుకోవడం చూస్తే దిల్ రాజు మార్కెటింగ్ గురించి చెప్పేదేముంది.