Begin typing your search above and press return to search.

ఎఫ్2 మరీ ఇంత సైలెంటా?

By:  Tupaki Desk   |   7 Jan 2019 1:58 PM GMT
ఎఫ్2 మరీ ఇంత సైలెంటా?
X
ఇంకో ముప్పై ఆరు గంటల లోపే టాలీవుడ్ అతి పెద్ద సంక్రాంతి యుద్ధం ఎన్టీఆర్ కథానాయకుడి రూపంలో మొదలుకానుంది . నాలుగు సినిమాలు బరిలో ఉండటంతో ప్రేక్షకుల ఓటు దేనికి పడుతుంది అనే దాని మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఉన్న వాటిలో వెంకటేష్ వరుణ్ తేజ్ ల కాంబోలో రూపొందిన మల్టీ స్టారర్ ఎఫ్2 తక్కువ బజ్ తో ఉండటం పట్ల ఇద్దరు హీరోల అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటిదాకా ఎఫ్2 టీం హైప్ తెచ్చే విషయంలో పెద్దగా ఫోకస్ చేయలేదు. ట్రైలర్ కూడా చాలా ఆలస్యంగా ఇందాక విడుదల చేసారు. కేవలం ఐదు రోజుల ముందు వదిలారంటే కారణం ఏమిటో మరి.

మిగిలిన మూడు సినిమాలలో తెరవేల్పు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జీవితం ఆధారంగా రూపొందింది కాబట్టి ఎన్టీఆర్ కథానాయకుడు మీద ఇప్పటికే చాలా పాజిటివ్ ఫీలర్స్ ఉన్నాయి. దానికి తోడు పక్కా ప్లానింగ్ తో క్రిష్ చేసిన ప్రమోషన్ అంచనాలు పెంచేసింది. ఓపెనింగ్స్ బాగా వచ్చి టాక్ బాగుంటే మాత్రం బ్రేకులు వేయడం కష్టమే.

మరోవైపు రామ్ చరణ్ వినయ విధేయ రామ మెగా అండ్ మాస్ ఫ్యాన్స్ అండతో రచ్చ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. బిసి సెంటర్స్ లో ఎగ్జిబిటర్లు దీన్ని ప్రదర్శించడానికే మొగ్గు చూపుతున్నారని గ్రౌండ్ రిపోర్ట్. వసూళ్ళ పరంగా కూడా రంగస్థలంకు దీటుగా నిలుస్తుందన్న అంచనాలు ఉన్నాయి.

ఇక రజనీకాంత్ పేట థియేటర్ల మాఫియా అంటూ ఏవో వివాదాలు రేపుతున్నప్పటికి టాక్ కనక పాజిటివ్ గా ఉంటే రజని కూడా క్రౌడ్ పుల్లర్ గా మారతాడు. ఈ నేపధ్యంలో కేవలం కామెడీని నమ్ముకుని వస్తున్న ఎఫ్2 వీటిని తట్టుకోవడం అంత ఈజీ కాదు. పైగా దేవిశ్రీ ప్రసాద్ ఆడియో మీద యావరేజ్ రిపోర్ట్ వచ్చింది. ఇన్ని ప్రతికూలతల మధ్య కేవలం వెంకీ వరుణ్ లను చూసి జనం ఎగబడి రారు. పైన మూడు సినిమాలను కాదనుకుని దీనికే వచ్చేంత మ్యాటర్ ఇందులో ఉందన్న అభిప్రాయం ఇంకా పబ్లిక్ లో కలగలేదు. సో ఎఫ్2 కు అందరికన్నా ఫైట్ చాలా టఫ్ గా ఉంటుంది. అసలే గత ఏడాది నుంచి బ్యాడ్ టైం వెంటాడుతున్న దిల్ రాజు దీని సక్సెస్ చాలా కీలకం. చూడాలి మరి ఏమవుతుందో.