Begin typing your search above and press return to search.

డిజిటల్ స్ట్రీమింగ్ లో రాజుగారి లెక్క తప్పిందే!

By:  Tupaki Desk   |   11 Feb 2019 4:25 PM GMT
డిజిటల్ స్ట్రీమింగ్ లో రాజుగారి లెక్క తప్పిందే!
X
అమెజాన్ లాంటి డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత నెలరోజుల్లోపే ప్రేక్షకులకు సినిమాను థియేటర్లకు వెళ్ళకుండానే చూసే అవకాశం కలుగుతోంది. మొదట్లో థియేట్రికల్ రిలీజ్ డేట్ నుండి యాభై రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందాలు కుదుర్చుకున్న డిజిటల్ ప్లేయర్స్ ఇప్పుడు నాలుగువారాల లోపే స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఇలా నెలరోజుల్లోనే స్ట్రీమింగ్ చేయడంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దిల్ రాజు లాంటి స్టార్ ప్రొడ్యూసర్ అందులో తప్పేమీ లేదని.. డిజిటల్ రైట్స్ కారణంగా నిర్మాతకు ఆర్థికంగా లాభం ఉన్నప్పుడు అలా చేయడంలో ఇబ్బందేమీ లేదనే అంటూ వచ్చారు.

కానీ మొదటిసారి అయన తన అభిప్రాయాన్ని మార్చుకోవాల్సి వచ్చేలా ఉంది. ఎందుకంటే దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కిన 'F2' సంక్రాంతి విన్నర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా నాలుగు వారాలు పూర్తయిన స్టడీగా కలెక్షన్స్ వసూలు చేస్తోంది. అయినా ఈ థియేట్రికల్ రన్ తో సంబంధం లేకుండా దిల్ రాజు ముందు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం అమెజాన్ ప్రైమ్ లోకి ఆదివారం అర్థరాత్రినుండి అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో ఇంకా చెప్పుకోదగ్గ కలెక్షన్స్ వసూలు చేస్తున్న సమయంలో ఈ సినిమాను అమెజాన్ లో స్ట్రీమింగ్ చేయడం ఖచ్చితంగా దిల్ రాజును ఇబ్బందికి గురిచేస్తుందనడంలో సందేహంలేదు. ఈ సినిమాకు ఈ రేంజ్ లో లాంగ్ రన్ ఉంటుందనిబహుశా ఆయన ఊహించి ఉండక పోవచ్చు. లేకపోతే ఖచ్చితంగా యాభై రోజుల తర్వాతే స్ట్రీమింగ్ చ్చేసేలా ఒప్పందం కుదుర్చుకునేవారేమో.

చిత్రమైన విషయం ఎంటంటే లాస్ట్ ఇయర్ 'రంగస్థలం' సినిమాకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. కాకపోతే యాభై రోజుల తర్వాత అమెజాన్ లో స్ట్రీమింగ్ చేశారు కాబట్టి కొంతలో కొంత మేలు. దిల్ రాజుకు ఎదురైన అనుభవం తో ఫ్యూచర్ లో నిర్మాతలు డిజిటల్ ఒప్పందాలు కుదుర్చుకునే సమయంలో మరింత ముందుచూపుతో వ్యవహరిస్తారని అనుకోవచ్చు.