Begin typing your search above and press return to search.
టీజర్ టాక్: వెంకీ వరుణ్..సూపర్ హంగామా
By: Tupaki Desk | 12 Dec 2018 12:14 PM GMTఅనిల్ రావిపూడి దర్శకత్వంలో.. దిల్ రాజు బ్యానర్లో తెరకెక్కుతున్న చిత్రం 'ఎఫ్ 2'. సీనియర్ హీరో వెంకటేష్.. మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ లు కలిసి నటిస్తున మల్టిస్టారర్ ఫిలిం ఇది. అనిల్ గత సినిమాలకంటే ఇంకొంచెం డోస్ పెంచిన కామెడీ ఎంటర్టైనర్ అని ఇప్పటికే హింట్ ఇచ్చారు ఫిలిం మేకర్స్. వెంకటేష్ జన్మదినం సందర్భంగా ఈ సినిమా టీజర్ ను ఫిలింమేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ సినిమాలో వెంకీ.. వరుణ్ లో తోడల్లుళ్ళుగా నటిస్తున్నరనే సంగతి తెలిసిందే. పెళ్ళి ఒక మగవాడి జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుంది అనేది ఈ సినిమా థీమ్. ఈ థీమ్ ను వెంకీ లైఫ్ లోనూ.. వరుణ్ లైఫ్ లోనూ చూపిస్తూ వాళ్ళ ఫ్రస్ట్రేషన్ తో ఫన్ జెనరేట్ చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు. టీజర్ ఆరంభం లోనే 'ఇప్పుడీ పెళ్ళి అవసరమా వెంకీ' అని రఘుబాబు వెంకీని అడిగితే "నేను మీలాగా కాదు.. పెళ్ళాన్ని ఎలా కంట్రోల్ చెయ్యాలో నాకు బాగా తెలుసు!" అంటాడు. కట్ చేసే 'కంట్రోల్ చెయ్యలేననే' విషయం అనుభవం లోకి వస్తుంది. సేమ్ సీన్ మళ్ళీ వరుణ్ విషయంలో రిపీట్. వెంకీ వరుణ్ తో "ఇంకోక్కసారి ఆలోచించు బ్రో.. పెళ్ళి అవసరమా" అంటాడు. "నేన్నీలెక్క గాదు. పెండ్లాన్ని కంట్రోల్ జేసుడు నాకు మస్తు దెల్సు" అంటాడు. ఇకేముంటుంది చెప్పండి... రచ్చ రంబోలా. వెంకీ సీనే మళ్ళీ వరుణ్ కు రిపీట్ అవుతుంది.
వెంకీ కామెడీ టైమింగ్ సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఇలాంటి ఫన్ రోల్ దొరికితే చెలరేగిపోతాడు. వరుణ్ కూడా ఫస్ట్ టైం కామెడీ ట్రై చేశాడు. వరుణ్ పాత్ర తెలంగాణా యాసలో మాట్లాడడం మరో హైలైట్. వెంకీ.. వరుణ్ ల మధ్య బ్రో.. బ్రో అంటూ పిలుచుకునే కెమిస్ట్రీ కూడా బాగుంది. ఓవరాల్ గా ఇది సంక్రాంతి పండగను మరింత కలర్ఫుల్ గా మార్చే సినిమాలాగే ఉంది. పెళ్ళాలుగా వెంకీ.. వరుణ్ లను పీక్కుతినే పాత్రల్లో తమన్నా మెహ్రీన్ లు నటిస్తున్నారు. ఈ ఫన్ ఫ్రస్ట్రేషన్ కు దేవీ సంగీతం యాడ్ అయితే.. అబ్బో.. ఇక మామూలుగా ఉండదు. ఆలస్యం అమృతం పెళ్ళాం.. ఇక టీజర్ చూడండి.