Begin typing your search above and press return to search.
గుసగుస: ఎఫ్ 3 హీరోల పారితోషికాల గుట్టు లీక్
By: Tupaki Desk | 16 Dec 2020 10:43 AM GMTఏదైనా క్రేజీ ప్రాజెక్ట్ మొదలవుతోంది అంటే దానిపై రకరకాల గాసిప్పులు షికార్ చేస్తుంటాయి. హీరో హీరోయిన్ల పారితోషికం.. ఇతర క్రూ పారితోషికాలపైనా ఆసక్తికర విషయాలు బయటకు వస్తుంటాయి. అలా చూస్తే 2021లో క్రేజీగా ప్రారంభం కాబోతున్న ఎఫ్ 3 మూవీ గురించి ప్రతిదీ హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈ మూవీలో నటిస్తున్న విక్టరీ వెంకటేష్ కి 12 కోట్ల పారితోషికం ముడుతోందని.. అలాగే వరుణ్ తేజ్ కి 8 కోట్ల మేర రెమ్యునరేషన్ ఇస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
నిర్మాత దిల్ రాజుతో ఆ మేరకు హీరోల ఒప్పందం కుదిరిందన్నది తాజా లీక్. ఇది ఎంతో క్రేజీ ప్రాజెక్ట్ కావడంతో నటీనటులు సాంకేతిక నిపుణులకు భారీగా పారితోషికం ఇస్తున్నారని కథనాలొస్తున్నాయి.
కేవలం రెమ్యునరేషన్ల రూపంలోనే ఈ మూవీ కోసం 50 కోట్లు గాయబ్ అవుతోందన్నది ఓ గుసగుస.
వెంకటేష్‌కు 12 కోట్లు.. వరుణ్ తేజ్‌కు రూ .8 కోట్లు.. తమన్నాకు రూ .2 కోట్లు.. మెహ్రీన్ కు రూ .70 లక్షలు.. సునీల్ కు రూ .75 లక్షలు.. దేవి శ్రీ ప్రసాద్‌కు రూ .3 కోట్లు.. ఇస్తున్నారట. అలాగే చిత్ర దర్శకుడు అనిల్ రావిపుడికి రూ .12 కోట్లు ఒప్పందం చేసుకున్నారని ప్రచారం సాగుతోంది. వీళ్లతో పాటు వెన్నెల కిషోర్ - శ్రీనివాస్ రెడ్డి ఇతర సాంకేతిక నిపుణుల పారితోషికాలు పెద్ద చెక్ లు అందుతున్నాయట. దాదాపు 70రోజుల పాటు షూటింగ్ ప్లాన్ చేయగా.. ప్రచార ఖర్చులు కలుపుకుని మొత్తం రూ.80 కోట్ల బడ్జెట్ పెట్టనున్నారట. ప్రస్తుత క్రైసిస్ సన్నివేశంలోనూ ఇంత పెద్ద మొత్తాల్ని పారితోషికాలుగా చెల్లిస్తున్నారంటే నిర్మాత గట్స్ ని మెచ్చుకోకుండా ఉండలేం. అయితే వీటికి సంబంధించి ఎలాంటి అధికారిక విషయం రివీల్ కాలేదు. కేవలం చిత్రబృందం గుసగుసలు మాత్రమే.