Begin typing your search above and press return to search.

'ఎఫ్ 3' మూవీ 17 రోజుల కలెక్షన్స్..!

By:  Tupaki Desk   |   13 Jun 2022 11:30 AM GMT
ఎఫ్ 3 మూవీ 17 రోజుల కలెక్షన్స్..!
X
విక్టరీ వెంకటేష్ మరియు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లు హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ''ఎఫ్ 3''. దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ఈ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్.. మే 27న థియేటర్లలోకి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా 17 రోజులలో జీఎస్టీతో కలుపుకుని రూ. 65.64 కోట్ల షేర్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

బ్లాక్ బస్టర్ 'ఎఫ్ 2' ఫన్ ఫ్రాంచైజీలో ''ఎఫ్ 3'' సినిమాని తెరకెక్కించారు అనిల్ రావిపూడి. అవే పాత్రలతో సరికొత్త కథతో రూపొందించారు. ఆద్యంతం ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టిన ఈ సినిమా.. మంచి టాక్ తో మొదటి వారంలో ఆశించిన స్థాయిలోనే కలెక్షన్స్ రాబట్టింది. కాకపోతే ఆ తర్వాత రోజుల్లో బాగా డ్రాప్స్ కనిపించాయి.

అధిక టికెట్ రేట్లు 'ఎఫ్ 3' సినిమాపై ప్రభావం చూపించాయని అర్థం అవుతోంది. అలానే తర్వాతి వారంలో వచ్చిన 'మేజర్' మరియు 'విక్రమ్' చిత్రాలు బ్లాక్ బస్టర్ అవడం కూడా మల్టీస్టారర్ మూవీపై ఎఫెక్ట్ చూపించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ మార్క్ కు కాస్త దూరంలోనే ఆగిపోయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

'ఎఫ్ 2' సినిమా అంచనాలకు మించి భారీ వసూళ్లు సాధించడంతో.. ''ఎఫ్ 3'' చిత్రాన్ని ఎక్కువ రేట్లకు విక్రయించారు. అయితే కొన్ని ఏరియాలలో బయ్యర్లకు నష్టాలు వచ్చినట్లు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. ఇకపోతే ఈ ఫన్ ఫ్రాంచైజీలో 'ఎఫ్ 4' సినిమా కూడా ఉంటుందని మేకర్స్ ఇంతకముందు ప్రకటించారు.

''ఎఫ్ 3'' సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ 17 రోజుల్లో సాధించిన వసూళ్ల వివరాలు క్రింద విధంగా ఉన్నాయి.
నైజాం - 18.70 కోట్లు
సీడెడ్ - 7.8 కోట్లు
వైజాగ్ - 6.80 కోట్లు
ఈస్ట్ - 3.80 కోట్లు
వెస్ట్ - 3.10 కోట్లు
కృష్ణా - 2.94 కోట్లు
గుంటూరు - 3.80 కోట్లు
నెల్లూరు - 2.1 కోట్లు

మొత్తం AP/TS 49.04 CR (GSTతో సహా)
కర్ణాటక - 4.6 కోట్లు
రెస్టాఫ్ ఇండియా - 2 కోట్లు
ఓవర్సీస్ - 10 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్ - 65.64 కోట్లు

కాగా, 'ఎఫ్ 3' సినిమాలో వెంకటేష్ సరసన తమన్నా భాటియా.. వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ కౌర్ హీరోయిన్లుగా నటించారు. సోనాల్ చౌహాన్ ప్రత్యేక పాత్రలో కనిపించగా.. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ లో ఆడిపాడింది. సునీల్ - వెన్నెల కిషోర్ - రాజేంద్ర ప్రసాద్ - మురళీ శర్మ - అలీ ఇతర పాత్రలు పోషించారు.

శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం సమకూర్చారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించగా.. తమ్మిరాజు ఎడిటింగ్ వర్క్ చేశారు.