Begin typing your search above and press return to search.
'ఎఫ్ 3' మూవీ 5 రోజుల వసూళ్ళు ఎలా ఉన్నాయంటే..!
By: Tupaki Desk | 2 Jun 2022 6:30 AM GMTవిక్టరీ వెంకటేష్ మరియు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం "ఎఫ్ 3". గత శుక్రవారం విడుదలైన ఈ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్.. ఫస్ట్ వీకెండ్ లో మంచి వసూళ్లనే రాబట్టగలిగింది. అయితే వీక్ డేస్ లో మాత్రం ఈ మల్టీస్టారర్ డ్రాప్స్ ని చవిచూస్తోంది.
'ఎఫ్ 3' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం కొన్ని ఏరియాల్లో డ్రాప్ కనిపించగా.. మరికొన్ని చోట్ల మంచి పట్టు సాధించింది. ఈస్ట్ - వెస్ట్ మరియు యూఏ ఏరియాలలో స్ట్రాంగ్ గా నిలబడింది. కానీ నైజాం - సీడెడ్ వంటి మిగిలిన ప్రాంతాలలో మాత్రం వసూళ్ళు పడిపోయాయి.
ఆంధ్రప్రదేశ్/తెలంగాణలలో 5వ రోజు 'ఎఫ్ 3' మూవీ 3 కోట్ల షేర్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఎంత పెద్ద సినిమాకైనా వీక్ డేస్ లో డ్రాప్స్ అనేవి కామన్. ఈ చిత్రానికి సోమవారంతో పోల్చుకుంటే 35% డ్రాప్ కనిపించింది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల్లో రూ. 35.05 కోట్లు రాబట్టినట్లు నివేదికలు వస్తున్నాయి. యుఎస్ఏలో ఇప్పటికే 1 మిలియన్ మార్క్ అందుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ఓవరాల్ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఈ సినిమా రెండో వారంలో కూడా స్ట్రాంగ్ గా నిలదొక్కుకోవాల్సి ఉంటుంది. కాకపోతే రేపు 'మేజర్' - 'విక్రమ్' - 'సుల్తాన్ పృథ్వీరాజ్' వంటి మూడు సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. మరి వీటి ప్రభావాన్ని తట్టుకొని 'ఎఫ్ 3' మూవీ ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.
బ్లాక్ బస్టర్ 'ఎఫ్ 2' ఫన్ ఫ్రాంచైజీలో ''ఎఫ్ 3'' సినిమా తెరకెక్కింది. ఇందులో వెంకేటేష్ సరసన తమన్నా భాటియా.. వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ కౌర్ హీరోయిన్లుగా నటించారు. సోనాల్ చౌహాన్ ప్రత్యేక పాత్రలో కనిపించగా.. పూజా హెగ్డే పార్టీ సాంగ్ లో మెరిసింది.
సునీల్ - వెన్నెల కిషోర్ - రాజేంద్ర ప్రసాద్ - మురళీ శర్మ - అలీ - రఘుబాబు - శ్రీకాంత్ అయ్యంగార్ - పృథ్వీరాజ్ - ప్రగతి - అన్నపూర్ణ - వై విజయ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చగా.. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించారు.