Begin typing your search above and press return to search.
బాక్సాఫీస్ వద్ద 'ఎఫ్ 3' పరిస్థితి ఎలా ఉంది..?
By: Tupaki Desk | 9 Jun 2022 2:30 AM GMTఎంత పెద్ద సినిమా అయినా స్టార్ హీరో చిత్రమైనా వీక్ డేస్ లో డ్రాప్ అవ్వడం సహజమే. రెండో వారంలో కొత్త సినిమాల సందడి ఉంటే వసూళ్ళు ఏ మేరకు డ్రాప్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ''ఎఫ్ 3'' మూవీ బాక్సాఫీస్ పరిస్థితి కూడా అలానే ఉంది.
విక్టరీ వెంకటేష్ మరియు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లు హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ''ఎఫ్ 3''. దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ఈ ఫన్ ఎంటర్టైనర్.. గత శుక్రవారం (మే 27) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాక్ ఎలా ఉన్నా ఫస్ట్ వీకెండ్ లో మంచి వసూళ్లనే రాబట్టింది.
ఆయితే సెకండ్ వీకెండ్ లో 'మేజర్' - 'విక్రమ్' సినిమాల నుంచి గట్టి పోటీ ఎదుర్కోవలసి వచ్చింది. అందులోనూ ఈ రెండూ హిట్ టాక్ తెచ్చుకోవడంతో 'ఎఫ్ 3' మూవీ నెమ్మదించింది. అయితే ఉన్నంతలో మంచి వసూళ్లనే సొంతం చేసుకుందని చెప్పాలి.
ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు తరలి రావడంతో రెండో వారంలో కలెక్షన్స్ పర్వాలేదనిపించాయి. కాకపోతే 'ఎఫ్ 3' బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకోడానికి ఇంకా కష్టపడాల్సిన ఉంది. 'ఎఫ్ 2' సక్సెస్ ని దృష్టిలో పెట్టుకొని ఈ మల్టీస్టారర్ ను అధిక రేట్లకు అమ్మారు. ట్రేడ్ వర్గాల నివేదికల ప్రకారం ఇంకా బ్రేక్ ఈవెన్ కు పది కోట్ల దూరంలో ఉందని తెలుస్తుంది.
రెండో వారం వర్కింగ్ డేస్ లో 'ఎఫ్ 3' చిత్రానికి 60% డ్రాప్స్ కనిపించాయని చెబుతున్నారు. ఈ లెక్కన రాబోయే వీకెండ్ లో అంచనాలను మించి బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా బిజినెస్ చేయాల్సి ఉంటుంది. హౌస్ ఫుల్స్ పడి మంచి షేర్లు అందుకుంటే అనుకున్న లక్ష్యానికి చేరుకునే అవకాశం ఉంది.
అయితే ఇప్పటికే కొన్ని ఏరియాల బయ్యర్లు సేఫ్ జోన్ లోకి వచ్చారని తెలుస్తోంది. ఇతర ప్రాంతాలలో ఎఫ్-3 బ్రేక్ ఈవెన్ మార్కును చేరుకుంటుందా లేదా అనేది ఈ వీకెండ్ లో వసూళ్లను బట్టి డిసైడ్ అవుతుంది. కాకపోతే ఈ వీక్ లో 'అంటే సుందరానికి' - '777 చార్లీ' వంటి రెండు సినిమాలు థియేటర్లకు వస్తున్నాయి. మరి 'ఎఫ్ 3' సినిమా ఏ మేరకు కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.
కాగా, 'ఎఫ్ 3' చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ నిర్మించారు. ఇది బ్లాక్ బస్టర్ 'ఎఫ్ 2' ఫన్ ఫ్రాంచైజీలో తెరకెక్కిన సినిమా. ఇందులో వెంకటేష్ సరసన తమన్నా భాటియా.. వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ కౌర్ హీరోయిన్లుగా నటించారు. సోనాల్ చౌహాన్ ప్రత్యేక పాత్రలో కనిపించగా.. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ లో మెరిసింది.
సునీల్ - వెన్నెల కిషోర్ - రాజేంద్ర ప్రసాద్ - మురళీ శర్మ - అలీ - రఘుబాబు తదితరులు ఇతర పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించగా తమ్మిరాజు ఎడిటింగ్ వర్క్ చేశారు.