Begin typing your search above and press return to search.
'F3' సమ్మర్ సోగ్గాళ్లకు నేటితో 40 రోజులు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఎంతంటే..?
By: Tupaki Desk | 5 July 2022 5:40 AM GMTవిక్టరీ వెంకటేష్ మరియు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన సినిమా ''ఎఫ్ 3''. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మల్టీస్టారర్ మూవీ మే 27న థియేటర్లలోకి వచ్చింది. నేటితో 40 రోజుల రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద హిట్టుగా నిలిచింది.
సమ్మర్ సోగ్గాళ్ళు అంటూ వచ్చిన 'ఎఫ్ 3' సినిమా థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించింది. పాండమిక్ తర్వాత కుటుంబ ప్రేక్షకులు నిజంగా థియేటర్లలో సినిమాలు చూడటానికి ఆసక్తి చూపలేదు. అటువంటి విపత్కర పరిస్థితులలో, 'F3' అన్ని వర్గాల ప్రేక్షకులను సినిమా హాళ్లకు రప్పించింది.
ఇప్పటికీ ఈ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో 10 థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుండటం విశేషం. నైజాంలో ఈ సినిమా 20 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసి, అరుదైన ఫీట్ సాధించింది.
ఓవరాల్ గా 'ఎఫ్ 3' సినిమా తన లైఫ్ టైమ్ రన్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో GSTతో కలుపుకుని రూ. 53.94 కోట్ల షేర్ రాబట్టిందని తెలుస్తోంది. అలానే ప్రపంచవ్యాప్తంగా 70.94 కోట్ల షేర్ తో రూ. 134 కోట్లు షేర్ వసూలు చేసింది.
* 'F3' సినిమా ఏరియాల వారీగా షేర్ల (GSTతో సహా) జాబితా పరిశీలిస్తే..
నైజాం - 20.57 కోట్లు
యూఏ - 7.48 కోట్లు
ఈస్ట్ - 4.18 కోట్లు
వెస్ట్ - 3.41 కోట్లు
కృష్ణ - 3.23 కోట్లు
గుంటూరు - 4.18 కోట్లు
నెల్లూరు - 2.31 కోట్లు
సీడెడ్ - 8.58 కోట్లు
కర్ణాటక - 5 కోట్లు
రెస్టాఫ్ ఇండియా - 2 కోట్లు
ఓవర్సీస్ - 10 కోట్లు
AP/TS వాటా - 53.94 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్ - 70.94 కోట్లు
టోటల్ గ్రాస్ - 134 కోట్లు
కాగా, బ్లాక్ బస్టర్ 'ఎఫ్ 2' ఫ్రాంచైజీలో అవే పాత్రలతో సరికొత్త కథతో ''ఎఫ్ 3'' చిత్రాన్ని రూపొందించారు అనిల్ రావిపూడి. ఇందులో వెంకటేష్ సరసన తమన్నా భాటియా.. వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ కౌర్ హీరోయిన్లుగా నటించారు. సోనాల్ చౌహాన్ ప్రత్యేక పాత్రలో కనిపించగా.. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ లో మెరిసింది. సునీల్ - వెన్నెల కిషోర్ - రాజేంద్ర ప్రసాద్ - మురళీ శర్మ - అలీ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.
దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ ఈ ఫన్ అండ్ ఫస్ట్రేషన్ చిత్రాన్ని నిర్మించారు. ఏడు వారాల థియేట్రికల్ రన్ పూర్తయ్యే వరకు 'ఎఫ్ 3' సినిమాను ఓటీటీ ప్లాట్ ఫారమ్ లలో విడుదల చేయకూడదని మేకర్స్ నిర్ణయించుకున్నారు.
ఈ నేపథ్యంలో సోనీ లివ్ ఓటీటీలో జులై 22న 'ఎఫ్ 3' చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయడానికి రెడీ అయ్యారు. థియేటర్లలో నవ్వుల అల్లర్లు సృష్టించిన ఈ మల్టీస్టారర్ మూవీ.. డిజిటల్ వేదికలలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాకి సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించారు.