Begin typing your search above and press return to search.
ఓటీటీ టాక్: ఈ రొట్ట కామెడీ మూవీ థియేటర్లో ఎలా హిట్టయిందో..?
By: Tupaki Desk | 25 July 2022 4:02 AM GMTకొన్ని సినిమాలు థియేట్రికల్ రిలీజ్ లో సక్సెస్ సాధించకపోయినా.. ఓటీటీలో ప్రేక్షకాదరణ పొందుతుంటాయి. మరికొన్ని చిత్రాలు ఓటీటీలో స్ట్రీమింగ్ కాబడిన తర్వాత.. అసలు ఇది థియేటర్లలో ఎలా హిట్టయింది? అని ట్రోల్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు 'ఎఫ్ 3' రెండో కేటగిరీకి చెందిన సినిమాగా ఓటీటీ ఆడియన్స్ తీర్పుస్తున్నారు.
విక్టరీ వెంకటేష్ మరియు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ''ఎఫ్ 3''. బ్లాక్ బస్టర్ 'ఎఫ్ 2' ఫ్రాంచైజీలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.
సమ్మర్ సోగ్గాళ్ళుగా మే 27న థియేటర్లలోకి వచ్చిన 'ఎఫ్ 3' సినిమా.. పాండమిక్ తర్వాత థియేటర్లకు దూరమైన ఫ్యామిలీ ఆడియన్స్ ను కొంతవరకు రప్పించగలిగింది. ఎలాగోలా 50 రోజులు ప్రదర్శించబడింది. తెలుగు రాష్ట్రాల్లో GSTతో కలుపుకుని రూ. 53.94 కోట్ల షేర్.. ప్రపంచవ్యాప్తంగా రూ. 70.94 కోట్ల షేర్ తో రూ.134 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని చిత్ర వర్గాలు వెల్లడించాయి.
ఇటీవల కాలంలో పెద్ద సినిమాలన్నీ థియేట్రికల్ రిలీజ్ తర్వాత నెల తిరక్కుండానే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న తరుణంలో.. 'ఎఫ్ 3' చిత్రాన్ని యాభై రోజుల తర్వాతే డిజిటల్ స్క్రీన్ మీదకు తీసుకొచ్చారు. అయితే థియేటర్లలో హిట్టుగా చెబుతున్న ఈ సినిమాకి ఆశ్చర్యకరంగా ఓటీటీలో నెగెటివ్ రెస్పాన్స్ వస్తోంది.
నెట్ ఫ్లిక్స్ మరియు సోనీ లివ్ ఓటీటీలలో 'ఎఫ్ 3' సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించిన ఈ చిత్రానికి డిజిటల్ రిలీజ్ లో డిజాస్టర్ రివ్యూలు వస్తున్నాయి. 50 రోజులు వెయిట్ చేసి ఓటీటీలో చూసిన జనాలు.. ఇదొక రొట్ట కామెడీ అని కామెంట్ చేస్తున్నారు.
అసలు ఈ సినిమా థియేటర్ లో ఎలా హిట్ అయ్యిందో అర్థం కావడం లేదని ట్రోల్ చేస్తున్నారు. ఓటీటీలో నచ్చని సీన్స్ స్కిప్ చేసే వెసులుబాటు ఉండటంతో.. ఎలాగోలా కానిచ్చేసామని అంటున్నారు.
'ఎఫ్ 2' లోని ప్రధాన పాత్రలతో సరికొత్త కథతో ''ఎఫ్ 3'' చిత్రాన్ని తెరకెక్కించారు అనిల్ రావిపూడి. అది కూడా డబ్బు చుట్టూనే తిరుగుతుంది. ఇందులో వెంకటేష్ సరసన తమన్నా భాటియా.. వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ కౌర్ హీరోయిన్లుగా నటించారు.
సోనాల్ చౌహాన్ ప్రత్యేక పాత్రలో కనిపించగా.. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ లో మెరిసింది. సునీల్ - వెన్నెల కిషోర్ - రాజేంద్ర ప్రసాద్ - మురళీ శర్మ - అలీ - రఘుబాబు - శ్రీకాంత్ అయ్యంగార్ - సంపత్ - సత్య - అన్నపూర్ణ - వై విజయ - ప్రగతి తదితరులు ఇతర పాత్రలు పోషించారు.
ఇందులో వెంకీ కి రేచీకటి.. వరుణ్ కు నత్తి వంటి లోపాలను పెట్టి.. అందులో నుంచి కామెడీ పుట్టించే ప్రయత్నం చేశారు. తమన్నా భాటియాతో మగాడి వేషం వేయించారు. అంతేకాదు ఆమెతో సోనాల్ చౌహాన్ లవ్ లో పడినట్లు చూపించారు. ఇలా అనేక సీన్లపై ఆడియన్స్ పెదవి విరుస్తున్నారు. మొత్తం మీద 'ఎఫ్ 3' సినిమాకి ఓటీటీలో నెగెటివ్ టాక్ వచ్చిందనేది స్పష్టం అవుతోంది.