Begin typing your search above and press return to search.
ఎఫ్3 గురించిన ఈ విషయం నిజం అయితే ఫుల్ ఎంటర్ టైన్‌మెంట్ పక్కా
By: Tupaki Desk | 11 Aug 2021 9:50 AM GMTఎఫ్ 2 సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఎఫ్ 3పై అంచనాలు సహజంగానే భారీగా ఉన్నాయి. ఎఫ్ 2 కు మరియు ఎఫ్ 3కి సంబంధం లేదు అంటూ ఇటీవల ఇంటర్వ్యూలో మరోసారి అనీల్ రావిపూడి క్లారిటీ ఇచ్చాడు. ఎఫ్ 3 సినిమా కథ పూర్తి విభిన్నంగా ఉంటుంది.. పాత్రలు కూడా వేరుగా ఉంటాయని చెప్పుకొచ్చాడు. నటీనటులు వారే కాని పాత్రలు మాత్రం వేరుగా ఉండబోతున్నాయి. ఎఫ్ 3 సినిమా కథ విషయం మై పలువురు పలు రకాలుగా ఊహించేస్తున్నారు. ఎఫ్ 2 లో వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ లు కో బ్రదర్స్ గా కనిపించారు. ఎఫ్ 3 లో ఎలా కనిపించబోతున్నారు అనే విషయమై స్పష్టత లేదు. కాని కథ మొత్తం కూడా డబ్బు చుట్టు తిరుగుతుందని సమాచారం అందుతోంది. ఎఫ్ 3 సినిమా లో ఉండే ఎలిమెంట్స్ ఫుల్ ఫన్ ను ఇస్తాయని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
దిల్ రాజు నిర్మిస్తున్న ఎఫ్ 3 సినిమాలో హీరో వెంకటేష్ పోషిస్తున్న పాత్రకు రేయి చీకట్లు ఇక వరుణ్ తేజ్ కనిపించబోతున్న పాత్రకు నత్తి ఉంటుందట. ఈ రెండింటితో సినిమా ఫన్ మామూలుగా ఉండదు. సాదారణంగా అయితే ఇలాంటి పాత్రలను చేసేందుకు హీరోలు ఆసక్తి చూపించరు. ముఖ్యంగా రేయి చీకటి ఉన్న పాత్రలో వెంకటేష్ నటించేందుకు ఒప్పుకోవడం గ్రేట్. ఇక నత్తి తో మాట్లాడటం అంటే చాలా కష్టమైన విషయం. అలాంటి పాత్రను చేసేందుకు వరుణ్ తేజ్ ఓకే చెప్పడం చాలా గొప్ప విషయం అంటూ మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఈ విషయమై చిత్ర యూనిట్ సభ్యుల నుండి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక క్లారిటీ లేదు. ఒక వేళ ఇదే కనుక నిజం అయితే ఎఫ్ 3 ది బెస్ట్ ఎంటర్ టైనర్ గా నిలవడం ఖాయం అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
డబ్బు సంపాదించడం కోసం హీరోలు చేసే ప్రయత్నాలు.. వారికి ఉన్న లోపాలు చూపిస్తూ సినిమాను ఫుల్ ఎంటర్ టైన్‌మెంట్ తో సాగించబోతున్నట్లుగా తెలుస్తోంది. పెద్ద ఎత్తున అంచనాలున్న ఎఫ్ 3 సినిమాను కరోనా సెకండ్ వేవ్ కు ముందు ఆగస్టులో విడుదల చేయాలని భావించారు. కాని షూటింగ్ ఆలస్యం అవ్వడం వల్ల కొత్త విడుదల తేదీ విషయంలో స్పష్టత ఇవ్వడం లేదు. త్వరలోనే అన్ని విషయాలపై స్పష్టత ఇస్తారని దిల్ రాజు టీమ్ నుండి సమాచారం అందుతోంది.